విరసం నేత వరవరరావుకు ఎట్టకేలకు బెయిల్, హైకోర్టు ఆదేశాలపై ముంబై ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్
విరసం నేత వరవరరావుకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఎల్గార్ పరిషత్ కేసులో పుణే జైలులో ఉన్నారు వరవరరావు. అయితే వరవరరావు తీవ్ర అస్వస్థతకు..
విరసం నేత వరవరరావుకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఎల్గార్ పరిషత్ కేసులో పుణే జైలులో ఉన్నారు వరవరరావు. అయితే వరవరరావు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హైకోర్టు ఆదేశాలపై ఆయనకు ముంబై ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ జరుగుతోంది. కాగా, మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న కేసులో అరెస్టు అయిన వరవరరావు హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే ఆయనకు ముంబై నానావతి ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆయన చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం తామే భరిస్తామని గతంలోనే మహారాష్ట్ర సర్కార్ కోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి వరవరరావు అనారోగ్యం పాలయ్యారు.