AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాగేంద్రను డిశ్చార్జ్‌ చేసేందుకు మరికొంత సమయం

విజయవాడ  దివ్యతేజస్విని హత్య కేసు నిందితుడిని డిశ్చార్జ్‌ చేసేందుకు మరికొంత సమయం పడుతుందని జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి తెలిపారు.

నాగేంద్రను డిశ్చార్జ్‌ చేసేందుకు మరికొంత సమయం
Ram Naramaneni
|

Updated on: Oct 30, 2020 | 3:18 PM

Share

విజయవాడ  దివ్యతేజస్విని హత్య కేసు నిందితుడిని డిశ్చార్జ్‌ చేసేందుకు మరికొంత సమయం పడుతుందని జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి తెలిపారు.  నిందితుడు నాగేంద్రకు గాయాల కారణంగా అధిక రక్తస్రావం కావటంతో ఇమ్యూనిటీ పవర్ తగ్గిందని చెప్పారు. ఆపరేషన్ చేసిన గాయం ఇంకా పూర్తిగా మానలేదన్నారు. ఇన్ఫెక్షన్ కూడా వ్యాపించిందని, గాయం మానిన తర్వాత డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. కాగా నాగేంద్ర ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్దం చేశారు. విజయవాడలోని క్రీస్తురాజపురం ప్రాంతానికి చెందిన దివ్య తేజశ్వినిని నాగేంద్ర కత్తితో దాడిచేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఆపై తనను తానే గాయపరుచుకున్నాడు.

Also Read :

జగ్గయ్యపేటలో భారీగా పట్టుబడ్డ అక్రమ మద్యం

ఇండియాలో పబ్జీ ఖతం..నేటి నుంచి వారికి కూడా నో ఛాన్స్

Follow Us