Vijay Sethupathi : విజయ్ సేతుపతి బాలీవుడ్ సినిమాను అడ్డుకున్న కరోనా.. ఆగిపోయిన షూటింగ్ ..

విజయ్ సేతుపతి..ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిన అవసరం లేదు. హీరోగా నటిస్తూనే మరో వైపు విలన్ గా ను మెప్పిస్తున్నారు విజయ్ సేతుపతి.

Vijay Sethupathi : విజయ్ సేతుపతి బాలీవుడ్ సినిమాను అడ్డుకున్న కరోనా.. ఆగిపోయిన షూటింగ్ ..
Vijay Sethupathi
Follow us
Rajeev Rayala

|

Updated on: May 17, 2021 | 6:43 AM

Vijay Sethupathi : విజయ్ సేతుపతి..ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిన అవసరం లేదు. హీరోగా నటిస్తూనే మరో వైపు విలన్ గా ను మెప్పిస్తున్నారు విజయ్ సేతుపతి. తమిళ్ , తెలుగు భాషల్లో విజయ్ సేతుపతి నటించారు. ఇటీవల దళపతి విజయ్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా మాస్టర్ లో విలన్ గా నటించి ఆకట్టుకున్నారు విజయ్ సేతుపతి. అలాగే తెలుగులో ఉప్పెన సినిమాలో రాయనం అనే పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు విజయ్ క్రేజ్ బాలీవుడ్ ను కూడా తాకింది. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్నాడు. విజయ్ సేతుపతి బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరో షాహిద్ కపూర్ నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో సేతుపతి నటిస్తున్నారు. మరో వైపు కత్రినా కైఫ్ నటిస్తున్న సినిమాలో కీలక  పాత్రలో కనిపించనున్నాడు సేతుపతి. కత్రినా కైఫ్ ప్రధాన పాత్రధారిగా ‘మేరీ క్రిస్మస్’ సినిమా రూపొందుతోంది.

‘అంధదూన్’ దర్శకుడు శ్రీ రామ్ రాఘవన్ ఈ సినిమాకి  దర్శకత్వం వహిస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల నిలిచిపోయింది. అయితే ఆమధ్య కత్రినా కైఫ్ కరోనా భారిన పడటంతో ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. దాంతో కాస్త గ్యాప్ తీసుకొని షూటింగ్ ను ప్రారంభిచాలని భావించారు. కానీ కరోనా వ్యాప్తి ఉగ్రరూపం దాల్చడంతో షూటింగ్ ను ఆపేసారు. నిజానికి విజయ్ సేతుపతి ఏప్రిల్ 15 న షూట్ ప్రారంభించాల్సి ఉందని అయితే ముంబైలో పరిస్థితి వల్ల షూట్ వాయిదా వేశామని తెలిపారు. మేకర్స్. ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్ చేయలేమని లాక్ డౌన్ పూర్తయిన తర్వాతే ప్లాన్ చేస్తామని.. శరవేగంగా సినిమాని పూర్తి చేస్తామని నిర్మాత తురాణీ వెల్లడించారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Pawan Kalyan meets Harish Shankar: పవర్ స్టార్ ను హరీష్ శంకర్ అలా చూపించబోతున్నాడా..?

Natural Star Nani : నేచురల్ స్టార్ మరోసారి ఓటీటీనే నమ్ముకుంటాడా.. ‘టక్ జగదీష్’ పరిస్థితేంటి..?

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?