ప్రభాస్‌ తల్లిగా.. సల్మాన్ ఖాన్ హీరోయిన్!

‘సాహో’ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘జాన్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. 1970-80ల కాలం నాటి పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే సీనియర్ నటుడు కృష్ణం రాజు కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజైన ప్రభాస్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. అయితే.. ఈ చిత్రంలో ప్రభాస్ […]

ప్రభాస్‌ తల్లిగా.. సల్మాన్ ఖాన్ హీరోయిన్!
Follow us

| Edited By: Srinu

Updated on: Jan 23, 2020 | 5:20 PM

‘సాహో’ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘జాన్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. 1970-80ల కాలం నాటి పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే సీనియర్ నటుడు కృష్ణం రాజు కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజైన ప్రభాస్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. అయితే.. ఈ చిత్రంలో ప్రభాస్ తల్లి పాత్రకు మంచి ఇంపాక్ట్ ఉందట. ఈ పాత్రకోసం ఒకప్పటి స్టార్ హీరోయిన్ ‘భాగ్యశ్రీ’ని అనుకున్నారట. అప్పట్లో సల్మన్ ఖాన్ పక్కన ‘మైనే ప్యార్ కియా’ చిత్రంలో నటించి.. ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు చాలా కాలం తర్వాత ప్రభాస్‌ జాన్ సినిమాలో తల్లిపాత్ర చేయడానికి ఓకే చెప్పిందని సమాచారం. కాగా ఈ సినిమా తెలుగు, కన్నడ, మళయాళ, తమిళ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. 2021 సమ్మర్‌ హాలీడేస్‌లో ఈ చిత్రం విడుదల చేయనున్నారని సమాచారం.