AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంచలనం: మహిళను రేప్ చేసేందుకు.. భర్తను దొంగతనం కేసులో ఇరికించి..

సినిమాల్లో కూడా ఇలాంటి కన్నింగ్ ప్లాన్‌ను చూసి ఉండకపోవచ్చు..! అందంగా ఉందని.. ఆమెను ఎలాగైనా పొందాలన్న కాంక్షతో కొందరు దుర్మార్గులు వేసిన పక్కా స్కెచ్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ దారుణ ఉదంతం ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని బరేలీ జిల్లాలో సిరౌలీ అనే చిన్న గ్రామంలోని జంటపై నలుగురు యువకుల కన్ను పడింది. భర్త లేనప్పుడు అతని భార్యను ఎలాగైనా రేప్ చేయాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే పక్కా ప్లాన్‌తో అతన్ని […]

సంచలనం: మహిళను రేప్ చేసేందుకు.. భర్తను దొంగతనం కేసులో ఇరికించి..
Ravi Kiran
| Edited By: |

Updated on: Jan 23, 2020 | 5:24 PM

Share

సినిమాల్లో కూడా ఇలాంటి కన్నింగ్ ప్లాన్‌ను చూసి ఉండకపోవచ్చు..! అందంగా ఉందని.. ఆమెను ఎలాగైనా పొందాలన్న కాంక్షతో కొందరు దుర్మార్గులు వేసిన పక్కా స్కెచ్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ దారుణ ఉదంతం ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని బరేలీ జిల్లాలో సిరౌలీ అనే చిన్న గ్రామంలోని జంటపై నలుగురు యువకుల కన్ను పడింది. భర్త లేనప్పుడు అతని భార్యను ఎలాగైనా రేప్ చేయాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే పక్కా ప్లాన్‌తో అతన్ని ఓ దోపిడీ కేసులో ఇరికించి జైలుకు పంపించారు. ఇంకేముంది తాము అనుకున్నట్లే ఆ మృగాళ్లు గత శుక్రవారం రాత్రి ఆమెపై కోరిక తీర్చుకునేందుకు ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి దూరారు. ఆమె నోట్లో గుడ్డలు కుక్కి.. విడతల వారీగా ఆ నలుగురు యువకులు ఆమెను గ్యాంగ్ రేప్ చేశారు.

అంతటితో ఆగని ఈ కామాంధులు తమ గుట్టు ఎక్కడ రట్టు అవుతుందేమోనని భయపడి కత్తితో ఆమె గొంతు కోశారు. కానీ ప్రాణాలతో బయటపడిన ఆమె గ్రామంలోని చుట్టుపక్కల వారిని పిలవడంతో ఆ నలుగురూ తప్పించుకుని పారిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందివ్వడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు అదే గ్రామానికి చెందిన యువైస్, నాజుక్ బేగ్, రియాసత్ బేగ్, అఫ్జల్‌లు అని గుర్తించారు. తనపై అత్యాచారం చేయడానికి తన భర్తను నిందితుల్లో ఒకరైన అఫ్జల్ పక్కా స్కెచ్ వేసి దొంగతనం కేసులో ఇరికించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కాగా, ఇప్పుడు ఈ కేసు పెద్ద సంచలనంగా మారింది.

ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు