వర్షం కోసం.. వరుణ యాగం..!

దేశం సుభిక్షంగా ఉండాలి.. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలి.. పంటలు పండించేందుకు పుష్కలంగా నీరు అందాలి.. ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి..? యగాలు, యజ్ఞాలు చేస్తే ఫలితం ఉంటుందని వేదపండితులు అంటున్నారు. దేశ వ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల నుంచి బయటపడేందుకు టీటీడీ, కంచి కామకోటి పీఠం సంయుక్తంగా వరుణయాగాన్ని చేపట్టింది. ఈ నెల 14 నుంచి 18 వరకూ దీన్ని ఓ బృహత్తరకార్యంగా తీసుకుంది. రోజూ ఉదయం 8.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట […]

వర్షం కోసం.. వరుణ యాగం..!
Follow us

| Edited By: Srinu

Updated on: May 15, 2019 | 5:28 PM

దేశం సుభిక్షంగా ఉండాలి.. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలి.. పంటలు పండించేందుకు పుష్కలంగా నీరు అందాలి.. ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి..? యగాలు, యజ్ఞాలు చేస్తే ఫలితం ఉంటుందని వేదపండితులు అంటున్నారు.

దేశ వ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల నుంచి బయటపడేందుకు టీటీడీ, కంచి కామకోటి పీఠం సంయుక్తంగా వరుణయాగాన్ని చేపట్టింది. ఈ నెల 14 నుంచి 18 వరకూ దీన్ని ఓ బృహత్తరకార్యంగా తీసుకుంది. రోజూ ఉదయం 8.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ దీన్ని నిర్వహిస్తారు. ఈ వరుణయాగాన్ని ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళకు చెందిన 10 మంది మహారుత్వికులు, వేద పండితులతో 5 రోజుల పాటు ఈ మహాకార్యాన్ని చేపట్టేందుకు టీటీడీ పూనుకుంది. పర్వేటు మంటపంలో దీన్ని ప్రారంభించారు.

కరేరి అంటే నలుపు వర్ణం. అందుకే ఈ యాగం కోసం అన్నీ నలుపు రంగు ద్రవ్యాలు, ధాన్యాలతో పాటు నలుపు రంగులోని మేక, గుర్రంలను కూడా ఉపయోగిస్తారు. చివరకు శ్వేత వర్ణ దుస్తులతో యాగాలు, పూజలు చేసే రుత్వికులు సైతం నల్లని దుస్తులు ధరించి పూజలు చేస్తారు. ఆకాశంలోని మేఘాల్ని కారు మబ్బులుగా మార్చేందుకు.. రెండు వేదాలను మూడు యాగాలను అనుసంధానం చేస్తూ ఏకకాలంలో ఈ కరేరి ఇష్టియాగాన్ని నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహిస్తూనే ప్రముఖ కళాకారులతో అమృత వర్షిణి రాగాన్ని నాదనీరాజన వైదికపై ఆలపిస్తారు.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో