దుర్గమ్మ సన్నిధిలో వరుణయాగం..!
ఏపీలో వర్షాలు బాగా పడాలని ప్రార్థిస్తూ నేటి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వరుణయాగం చేపట్టారు. మూడు రోజుల పాటు వరుణ ఉపాసన, జంపాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ గణపతి పూజతో వరుణ యాగాన్ని ప్రారంభించారు. నాలుగో రోజు వరుణయాగం, రుద్రహోమం చేయనున్నారు. చివరి రోజు సహస్రాభిషేకం నిర్వహిస్తారు. పదుల సంఖ్యలో వేద పండితులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదిలా వుంటే వాతావరణ శాఖ అధికారులు మాత్రం.. అనుకున్న […]
ఏపీలో వర్షాలు బాగా పడాలని ప్రార్థిస్తూ నేటి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వరుణయాగం చేపట్టారు. మూడు రోజుల పాటు వరుణ ఉపాసన, జంపాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ గణపతి పూజతో వరుణ యాగాన్ని ప్రారంభించారు. నాలుగో రోజు వరుణయాగం, రుద్రహోమం చేయనున్నారు. చివరి రోజు సహస్రాభిషేకం నిర్వహిస్తారు. పదుల సంఖ్యలో వేద పండితులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదిలా వుంటే వాతావరణ శాఖ అధికారులు మాత్రం.. అనుకున్న సమయానికి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకుతాయని అంచనా వేశారు. వారి అంచనాలూ తలకిందులయ్యాయి. మరో రెండు రోజుల్లో రుతుపవనాలు తాకుతాయని అంటున్నారు. గడిచిన నాలుగైదేళ్లలో రుతుపవనాల తీరు గమనిస్తే.. ఈ సారి మాత్రమే ఆలస్యం అయిందని చెబుతున్నారు.