నేటి నుంచి జెట్ ఎయిర్ వేస్ పై విచారణ

ఆర్థిక ఇబ్బందులతో కుప్పకూలిన ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ దివాలాకు సంబంధించిన పిటిషన్ పై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ నేటి నుంచి విచారణ జరపనుంది. తాజాగా ఇందులో తమను పార్టీలుగా చేర్చాలని జెట్‌ ఎయిర్‌వేస్‌ పైలట్లు, ఇంజినీర్ల యూనియన్లతో పాటు నెదర్లాండ్స్‌కి చెందిన రెండు లాజిస్టిక్స్‌ వెండింగ్‌ సంస్థలు కూడా ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించాయి. తాము కూడా ఇంటర్‌వెన్షన్‌ పిటిషన్‌ వేసేందుకు అనుమతించాలని వెండర్లు కోరారు. జెట్‌ భారీగా బాకీ పడటంతో దానికి లీజుకిచ్చిన […]

నేటి నుంచి జెట్ ఎయిర్ వేస్ పై విచారణ
Follow us

| Edited By:

Updated on: Jun 20, 2019 | 8:29 AM

ఆర్థిక ఇబ్బందులతో కుప్పకూలిన ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ దివాలాకు సంబంధించిన పిటిషన్ పై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ నేటి నుంచి విచారణ జరపనుంది. తాజాగా ఇందులో తమను పార్టీలుగా చేర్చాలని జెట్‌ ఎయిర్‌వేస్‌ పైలట్లు, ఇంజినీర్ల యూనియన్లతో పాటు నెదర్లాండ్స్‌కి చెందిన రెండు లాజిస్టిక్స్‌ వెండింగ్‌ సంస్థలు కూడా ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించాయి. తాము కూడా ఇంటర్‌వెన్షన్‌ పిటిషన్‌ వేసేందుకు అనుమతించాలని వెండర్లు కోరారు. జెట్‌ భారీగా బాకీ పడటంతో దానికి లీజుకిచ్చిన విమానాలను ఈ ఏడాది మార్చిలో అమ్‌స్టర్‌డామ్‌ ఎయిర్‌పోర్టులో ఈ రెండు సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే, ఈ సంస్థల పేర్లు ఇంకా వెల్లడి కాలేదు.

ఏప్రిల్‌ 17 నుంచి జెట్‌ కార్యకలాపాలు నిలిచిపోవడంతో.. దాదాపు రూ. 8,500 కోట్ల రుణాలు రాబట్టుకునేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సారథ్యంలోని 26 బ్యాంకుల కన్సార్షియం.. జెట్‌ ఎయిర్‌వేస్‌పై ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌ దాదాపు 23,000 ఉద్యోగులకు రూ. 3,000 కోట్లు జీతాలు, ఇతరత్రా విమానాల వెండార్లు, లెస్సర్లకు రూ. 10,000కోట్ల దాకా బాకీపడింది.