బీజేపీ వైపు.. రాజగోపాల్ రెడ్డి చూపు
తెలంగాణ కాంగ్రెస్‌లో కొన్ని రోజులుగా జరుగుతున్న సస్పెన్స్ మరికొన్ని గంటల్లో సస్పెన్ష్ వీడనుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ముఖ్య అనుచరులతో చర్చించిన రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్‌లో కొనసాగేదిలేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఈ సాయంత్రం 4గంటలకు ఆయన మరోసారి కార్యకర్తలతో సమావేశమై తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. మరోవైపు కోమటిరెడ్డి సోదరుడు వెంకటరెడ్డి మాత్రం తాను పార్టీ మారనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కాగా […]

తెలంగాణ కాంగ్రెస్‌లో కొన్ని రోజులుగా జరుగుతున్న సస్పెన్స్ మరికొన్ని గంటల్లో సస్పెన్ష్ వీడనుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ముఖ్య అనుచరులతో చర్చించిన రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్‌లో కొనసాగేదిలేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఈ సాయంత్రం 4గంటలకు ఆయన మరోసారి కార్యకర్తలతో సమావేశమై తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. మరోవైపు కోమటిరెడ్డి సోదరుడు వెంకటరెడ్డి మాత్రం తాను పార్టీ మారనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కాగా త్వరలోనే రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్ధాన్ని పుచ్చుకోనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే మరోవైపు ఇటీవల నల్గొండలో కాంగ్రెస్, ఆ పార్టీ నేతలపై రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం మండిపడింది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత ఎం. కోదండరెడ్డి నేతృత్వంలోని పీసీసీ క్రమశిక్షణా సంఘం నోటీసులు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని లేదంటే క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నట్లు అందులో స్పష్టం చేశారు.