కెనాల్‌లో బోల్తా పడ్డ వ్యాన్.. ఏడుగురు గల్లంతు

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతన్న వ్యాన్ ఇందిరా కెనాల్‌లో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు పిల్లలు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పట్వాఖండా గ్రామం నాగ్‌రాం పీఎస్ పరిధిలో జరిగింది. ప్రమాద సమయంలో వ్యాన్‌లో మొత్తం 29 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 22 మందిని రక్షించారు. కాగా […]

కెనాల్‌లో బోల్తా పడ్డ వ్యాన్.. ఏడుగురు గల్లంతు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 20, 2019 | 10:08 AM

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతన్న వ్యాన్ ఇందిరా కెనాల్‌లో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు పిల్లలు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటన పట్వాఖండా గ్రామం నాగ్‌రాం పీఎస్ పరిధిలో జరిగింది. ప్రమాద సమయంలో వ్యాన్‌లో మొత్తం 29 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 22 మందిని రక్షించారు. కాగా ఏడుగురు చిన్నారుల కోసం గాలింపు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.