నేటి నుంచి వానలే వానలు..?

వాతావరణ శాఖ శుభవార్త ప్రకటించింది. నేటి నుంచి రాష్ట్రంలో వానలు కురవనున్నట్లు తెలిపారు. నైరుతి రుతుపవనాలు మరో 48 గంటల్లో రాయలసీమలోకి ప్రవేశించనున్నాయి. అయితే రుతుపవనాల ప్రవేశానికి ముందు తొలకరి జల్లులు కురుస్తాయి. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరకోస్తాకు ఆవల ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సముద్రమట్టానికి 3.6 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఇది ఆవరించి ఉంది. ఫలితంగా వచ్చే నాలుగు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ […]

నేటి నుంచి వానలే వానలు..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 20, 2019 | 1:53 PM

వాతావరణ శాఖ శుభవార్త ప్రకటించింది. నేటి నుంచి రాష్ట్రంలో వానలు కురవనున్నట్లు తెలిపారు. నైరుతి రుతుపవనాలు మరో 48 గంటల్లో రాయలసీమలోకి ప్రవేశించనున్నాయి. అయితే రుతుపవనాల ప్రవేశానికి ముందు తొలకరి జల్లులు కురుస్తాయి. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరకోస్తాకు ఆవల ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సముద్రమట్టానికి 3.6 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఇది ఆవరించి ఉంది. ఫలితంగా వచ్చే నాలుగు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక అదే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని భారత వాతావరణ విభాగం స్పష్టం చేసింది.