varun tej corona positive : మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం.. వరుణ్ తేజ్ కు పాజిటివ్

మెగా హీరో రాంచరణ్ కు కరోనా పాజిటివ్ గా తేలిన విషయం తెలిసిందే. తాజాగా మెగా ఫ్యామిలీ లో మరో హీరో కరోనా బారిన పడ్డాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు కరోనా పాజిటివ్ గా

varun tej corona positive : మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం.. వరుణ్ తేజ్ కు పాజిటివ్
Follow us
Rajeev Rayala

| Edited By: Anil kumar poka

Updated on: Dec 29, 2020 | 4:51 PM

మెగా హీరో రాంచరణ్ కు కరోనా పాజిటివ్ గా తేలిన విషయం తెలిసిందే. తాజాగా మెగా ఫ్యామిలీ లో మరో హీరో కరోనా బారిన పడ్డాడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. తనకు కోవిడ్ 19 పాజిటివ్‌ వచ్చినట్టుగా వరుణ్ తేజ్‌ స్వయంగా వెల్లడించాడు. కొద్ది పాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని వరుణ్‌  తెలిపాడు. ప్రస్తుతం హోం క్వారెంటైన్‌లో ఉన్నానని తెలిపాడు వరుణ్. ఇదిలా ఉంటే మంగళవారం ఉదయం తనకు పాజిటివ్‌ వచ్చినట్టుగా మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. చరణ్ ఇచ్చిన క్రిస్మస్‌ పార్టీలో వరుణ్ తేజ్‌ పాల్గొన్నారు. ఆ సమయంలోనే కరోనా సోకి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఇక మెగా హీరోలు వరుసగా కరోనా బారిన పడుతుండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరోలు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.