Vaccination 3rd phase: కోవిడ్ వ్యాక్సినేషన్ పై కేంద్రం కొత్త మార్గాదర్శాకాలు జారీ.. రాష్ట్రాలు కోవిన్ యాప్ లో టీకాల పంపిణీ వివరాలు నమోదు చేయాలని సూచన!

 దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు కనీ, వినీ ఎరుగని విధంగా పెరిగిపోతున్నాయి. దీంతో కరోనా వైరస్ పై పోరుకు తక్షణ కర్తవ్యం వ్యాక్సినేషన్ వేగవంతం చేయడమే అనే భావనలోకి వచ్చింది కేంద్ర ప్రభుత్వం

Vaccination 3rd phase: కోవిడ్ వ్యాక్సినేషన్ పై కేంద్రం కొత్త మార్గాదర్శాకాలు జారీ.. రాష్ట్రాలు కోవిన్ యాప్ లో టీకాల పంపిణీ వివరాలు నమోదు చేయాలని సూచన!
Vaccination
Follow us

|

Updated on: Apr 24, 2021 | 11:27 PM

Vaccination 3rd phase: దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు కనీ, వినీ ఎరుగని విధంగా పెరిగిపోతున్నాయి. దీంతో కరోనా వైరస్ పై పోరుకు తక్షణ కర్తవ్యం వ్యాక్సినేషన్ వేగవంతం చేయడమే అనే భావనలోకి వచ్చింది కేంద్ర ప్రభుత్వం. అందుకే మే 1 వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ ను 18 ఏళ్లు నిండిన అందరికీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో టీకా కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూసుకోవాలని రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది కేంద్రం. ఇక ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి కేంద్రం శనివారం కొత్త గైడ్ లైన్స్ జారీ చేసింది. ఈ మార్గాదర్శాకాలను తప్పకుండా పాటించాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలను కోరారు. టీకా పంపిణీ వివరాలను ఎప్పటికప్పుడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కోవిన్ యాప్ లో అప్ లోడ్ చేయాలని సూచించారు. టీకాల పంపిణీకి రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన కొత్త మార్గాదర్శాకాలు ఇలా ఉన్నాయి.

ప్రయివేటు ఆసుపత్రులు, ఇండస్ట్రీలకు చెందిన ఆసుపత్రులు తదితర వాటి సహకారంతో అదనపు ప్రయివేటు కొవిడ్ వ్యాక్సిన్‌ కేంద్రాలను రిజిస్టర్‌ చేయాలి.

ఏయే ఆసుపత్రులు ఎన్ని వ్యాక్సిన్లను కొనుగోలు చేశాయి.. టీకా నిల్వలు, వ్యాక్సిన్‌ ధరలను కొవిన్‌ యాప్‌లో ఎప్పటికప్పుడు పరిశీలించాలి.

  • కొవిన్‌లో వ్యాక్సిన్‌ స్లాట్‌లను అందుబాటులో ఉంచుతూ అర్హులై వారందరికీ టీకాలు వేయాలి.
  • రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలు నేరుగా వ్యాక్సిన్ల కొనుగోలు నిర్ణయానికి ప్రాధాన్యమివ్వాలి.
  • 18-45 ఏళ్ల వయసు గ్రూప్‌ వారికి కేవలం ‘ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ మాత్రమే’ అన్న విషయాన్ని ప్రచారం చేయాలి.
  • వ్యాక్సినేషన్‌, కొవిన్‌ యాప్‌ వినియోగంపై సిబ్బందికి ముందుగానే శిక్షణ ఇవ్వాలి.
  • టీకా కేంద్రాల వద్ద రద్దీ ఉండకుండా చూసే అధికారులకు పూర్తి సహకారం అందించాలి.

ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం కోవిడ్ -19 వ్యాక్సిన్ ధరలను ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వ్యాక్సిన్ ధరలపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం వెనక్కి తగ్గింది. ధరలను భారీగా తగ్గిస్తూ శనివారం నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉన్న కోవ్యాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను.. భారత ప్రభుత్వం డోసుకు రూ.150 చొప్పున నిర్ణయించింది. అయితే ప్రభుత్వం వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలకు పూర్తిగా ఉచితంగా అందిస్తుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Also Read: Oxygen: కరోనా పేషెంట్స్ కు ఆక్సిజన్ ఎప్పుడు అవసరం అవుతుంది? అసలు మన శరీరానికి ఆక్సిజన్ ఎంత అవసరం అవుతుంది?

Birthday Celebrations: ఇంట్లోనే పుట్టినరోజు వేడుకలు చేసుకున్న యువతి..ముంబయి పోలీసుల స్పెషల్ గిఫ్ట్..ట్విట్టర్ లో ట్రెండింగ్!