క‌రోనాపై పోరు : భారత్‌కు అమెరికా సీడీసీ సాయం 27 కోట్లు..

కోవిడ్-19 వైర‌స్ నియంత్రణకు అలుపెర‌గ‌ని పోరాటం చేస్తోన్న‌భారత్ కు… అమెరికా వ్యాధుల నియంత్రణ కేంద్రం (సీడీసీ) 36 లక్షల డాలర్ల (సుమారు రూ. 27 కోట్లు) సహాయాన్ని ప్రకటించింది. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో ఈ విష‌యాన్ని తెలిపింది. క‌రోనా నివారణ, సంసిద్ధత, ప్రతిస్పందనల కోసం భార‌త్ ఈ డ‌బ్బును వినియోగించ‌నుంది. తొలి విడత సహాయాన్ని కరోనా టెస్టులకు ఉపయోగిస్తారు. కోవిడ్-19 మాత్రమే కాకుండా భవిష్యత్తులో వచ్చే వ్యాధులను స‌మ‌ర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా ప్రజారోగ్య […]

క‌రోనాపై పోరు : భారత్‌కు అమెరికా సీడీసీ సాయం 27 కోట్లు..
Follow us

|

Updated on: May 12, 2020 | 10:45 PM

కోవిడ్-19 వైర‌స్ నియంత్రణకు అలుపెర‌గ‌ని పోరాటం చేస్తోన్న‌భారత్ కు… అమెరికా వ్యాధుల నియంత్రణ కేంద్రం (సీడీసీ) 36 లక్షల డాలర్ల (సుమారు రూ. 27 కోట్లు) సహాయాన్ని ప్రకటించింది. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో ఈ విష‌యాన్ని తెలిపింది. క‌రోనా నివారణ, సంసిద్ధత, ప్రతిస్పందనల కోసం భార‌త్ ఈ డ‌బ్బును వినియోగించ‌నుంది. తొలి విడత సహాయాన్ని కరోనా టెస్టులకు ఉపయోగిస్తారు.

కోవిడ్-19 మాత్రమే కాకుండా భవిష్యత్తులో వచ్చే వ్యాధులను స‌మ‌ర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా ప్రజారోగ్య సిబ్బంది వ్యవస్థను అభివృద్ధి చేయడంలో సీడీసీ స్థానిక భాగస్వాములతో కలిసి వ‌ర్క్ చేస్తోంది. గత జనవరి నుంచి సీడీసీ భారత కార్యాలయం.. జాతీయ, ప్రాంతీయ సంస్థలతో భాగస్వామ్య కృషి జరుపుతుంది. దేశవ్యాప్తంగా డాక్ట‌ర్లు, నర్సులు, ఆరోగ్య సంరక్షణ అధికారులు, హాస్పిటల్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. టీబీ, మలేరియా, హెచ్ఐవీ నియంత్రణ, పోలియో నిర్మూలన, ఇతర మహమ్మారులను ఎదుర్కోవడంలో సంసిద్ధత విషయంలో భారత్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖతో సీడీసీ ఎంతోకాలంగా అనుబంధాన్ని కొనసాగిస్తున్నది.