ఒక్క డ్యాన్స్ క్లాస్​తో​ రూ.5 కోట్లు..వాటిని క‌రోనాపై పోరాటానికి విరాళం

ఒక్క డ్యాన్స్ క్లాస్​తో​ రూ.5 కోట్లు..వాటిని క‌రోనాపై పోరాటానికి విరాళం

బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా తన గ్లామ‌ర్ తోనే కాదు.. కాకుండా మంచి మనసుతోను ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఈ ముద్దుగుమ్మ‌ కరోనా వైరస్‌పై పోరాటానికి తనవంతుగా ఐదు కోట్ల రూపాయాలు డొనేష‌న్ ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఊర్వశికి 1.8 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. త‌న ఫాలోవ‌ర్స్ సహకారంతో ఈమె ఓ డ్యాన్‌ క్లాస్‌ని కండెక్ట్ చేసింది. దాంతో ఆమెకు వారి నుంచి భారీగా డొనేష‌న్స్ అందాయి. “ఇలాంటి క్లిష్ట సమయాల్లో సాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి […]

Ram Naramaneni

|

May 12, 2020 | 10:25 PM

బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా తన గ్లామ‌ర్ తోనే కాదు.. కాకుండా మంచి మనసుతోను ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఈ ముద్దుగుమ్మ‌ కరోనా వైరస్‌పై పోరాటానికి తనవంతుగా ఐదు కోట్ల రూపాయాలు డొనేష‌న్ ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఊర్వశికి 1.8 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. త‌న ఫాలోవ‌ర్స్ సహకారంతో ఈమె ఓ డ్యాన్‌ క్లాస్‌ని కండెక్ట్ చేసింది. దాంతో ఆమెకు వారి నుంచి భారీగా డొనేష‌న్స్ అందాయి.

“ఇలాంటి క్లిష్ట సమయాల్లో సాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి నా థాంక్స్. 2.5 కోట్ల మంది ఫాలోవర్స్​లో 1.8 కోట్ల మంది డ్యాన్స్‌ క్లాస్‌లో పాల్గొన్నారు. వారి స‌హ‌కారంతో 5 కోట్ల రూపాయలు కలెక్ట్ చేశాను. ఈ సాయం చిన్నదే కావచ్చు. మా ప్రయత్నం మాత్రం వృథా అవ్వ‌లేదు. కొవిడ్‌పై పోరాటానికి అందరి సాయం అవసరం. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో సాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు” అని ఊర్వశి రౌతేలా పేర్కొంది.

‘సింగ్‌ సాబ్‌ ది గ్రేట్‌’ మూవీతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన‌ ఊర్వశి, కన్నడలో ‘మిస్టర్‌.ఐరావత’లో నటించింది. తర్వాత ‘భాగ్‌ జానీ’, ‘కాబిల్‌’ సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్స్ లో న‌ర్తించి మెప్పించింది. ప్రస్తుతం ‘వర్జిన్‌ భానుప్రియ’ అనే మూవీలో లీడ్ రోల్ లో నటిస్తోంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu