యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు బెదిరింపు సందేశం, అజ్ఞాత వ్యక్తి అరెస్టుకు రంగంలోకి దిగిన పోలీసులు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కి ఎవరో అజ్ఞాత వ్యక్తి నుంచి బెదిరింపు మెసేజ్ అందింది. వాట్సాప్ ఎమర్జెన్సీ డయల్ నెంబర్ 112 ద్వారా ఆయనకు ఈ మెసేజ్ అందిందట...
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కి ఎవరో అజ్ఞాత వ్యక్తి నుంచి బెదిరింపు మెసేజ్ అందింది. వాట్సాప్ ఎమర్జెన్సీ డయల్ నెంబర్ 112 ద్వారా ఆయనకు ఈ మెసేజ్ అందిందట. అందులో మీకు 4 రోజులే మిగిలి ఉన్నాయని పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. వీరికి ఫిర్యాదు అందగానే ఆ వ్యక్తి కోసం గాలింపు ప్రారంభించారు. ఆ వ్యక్తిని పట్టుకుని అరెస్టు చేసేందుకు ప్రత్యేకంగా నిఘా టీమ్ ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 29 వ తేదీ సాయంత్రం యోగి ఆదిత్యనాథ్ కి ఈ బెదిరింపు మెసేజ్ అందిందని పోలీసులు చెప్పారు. ఆయనకు బెదిరింపు కాల్స్ అందడం కొత్తేమీ కాదు. గత ఏడాది సెప్టెంబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో కూడా ఆయనకు బెదిరింపు కాల్స్ అందాయని వారు చెప్పారు. ఈ సీఎం కి ప్రాణహాని ఉందంటూ గత నవంబరులో 15 ఏళ్ళ టీనేజర్ ఒకడు 112 హెల్ప్ లైన్ కి మెసేజ్ పంపగా అతడి మొబైల్ నెంబర్ ని ఖాకీలు ట్రేస్ చేశారు. అతడ్ని ఆగ్రాలో ఉన్నవాడిగా గుర్తించి ఆ నగరానికి వెళ్లి అరెస్టు చేశారు. ఆ తరువాత జువెనైల్ హోమ్ కి తరలించారు. కోవిడ్ పాండమిక్ కారణంగా స్కూళ్ళు మూసివేయడంతో ఇతగాడు విసుగు చెంది ఈ పనికి పాల్పడినట్టు తెలిసింది. యోగికి భద్రత తక్కువేమీ కాదు. ఆయనకు జెడ్ కేటగిరీ వీవీఐపీ సెక్యూరిటీ ఉంది. 25 నుంచి 28 మంది కమెండోలు ఆయన ఎక్కడికి వెళ్లినా ఆయన నీడలా వెన్నంటి ఉంటారు.
యూపీలో అసలే నేరాలు ఎక్కువ.. అవినీతిపరులైన పోలీసులతో కలిసి నేరగాళ్లు ఎంతకైనా తెగిస్తూ ఉంటారు. అక్కడ అమాయక యువతుల హత్యలు, రేప్ లు ఎక్కువగా జరుగుతుంటాయని, బలవంతపు వసూళ్లు సర్వ సాధారణమని హ్యూమన్ వాచ్ డాగ్ పలు సందర్భాల్లో పేర్కొంది. మరిన్ని చదవండి ఇక్కడ : ఓటీటీలో దుమ్మురేపుతున్న పవన్ కళ్యాణ్ వీడియో వకీల్ సాబ్ … :Vakeel Saab creates record OTT video. మూగజీవాలపై యాసిడ్ దాడి ..?ఏపీ లో మరో భయం! యాసిడ్ లంపి వైరస్ హడల్ వైరల్ వీడియో …