దుబ్బాక ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేంద్ర మంత్రి

దుబ్బాకలో పరిస్థితులను బట్టే.. పోలీస్‌ స్పెషల్ అబ్జర్వర్, కేంద్ర బలగాలు దింపుతామని ఆయన ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు అధికారులపై చర్యలు తీసుకోలేమని, అవగాహన లేనివారే అనవసర ఆరోపణలు చేస్తుంటారని కిషన్‌రెడ్డి అన్నారు.

  • Sanjay Kasula
  • Publish Date - 7:32 pm, Thu, 29 October 20
దుబ్బాక ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేంద్ర మంత్రి

G Kishan Reddy Campaigning : దుబ్బాక ఉప్ప ఎన్నికల పోరు మరింత రాజుకుంటోంది. నువ్వా.. నేనా అన్నట్లు సాగుతున్న ప్రచారంలో ఎవరికి వారే దూసుకుపోతున్నారు. ప్రధాన పార్టీల నేతలు ఆ నియోజక వర్గంపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దుబ్బాకలో పర్యటించనున్నారు. శుక్రవారం నుంచి 2 రోజుల పాటు దుబ్బాకలో ఆయన పర్యటన సాగనుంది.

దుబ్బాకలో పరిస్థితులను బట్టే.. పోలీస్‌ స్పెషల్ అబ్జర్వర్, కేంద్ర బలగాలు దింపుతామని ఆయన ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు అధికారులపై చర్యలు తీసుకోలేమని, అవగాహన లేనివారే అనవసర ఆరోపణలు చేస్తుంటారని కిషన్‌రెడ్డి అన్నారు.

రేపు ఉదయం 9గంటలకు హైదరాబాద్ నుండి దుబ్బాకకు కిషన్‌రెడ్డి బయలుదేరనున్నారు. దుబ్బాక ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారు. 11గంటల నుండి 12.30 వరకు భుమ్‌పల్లి ఎక్స్ రోడ్‌ వద్ద నిర్వహించే సభలో పాల్గొంటారని బీజేపీ నేతలు చెబుతున్నారు.

ఆ తర్వాత 1.30 సిద్దిపేటలో సభ పాల్గొంటారు. సాయంత్రం 4 గంట గంటలకు దుబ్బాక సభలో ప్రసంగిస్తారు. 6గంటల నుంచి ఏడు గంటల వరకు తిమ్మాపూర్‌లో నిర్వహించే సభలో పాల్గొంటారు. దుబ్బాక ఉప ఎన్నికను టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి.