Narendra Modi: ప్రధాని మోదీకి మరో అరుదైన ఆహ్వానం.. జీ-7 శిఖరాగ్ర సమావేశాలకు రావాలన్న బ్రిటన్ ప్రధాని..
UK Invites PM Modi For G7: భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన ఆహ్వానం లభించింది. ఈ ఏడాది జరగనున్న జీ–7 దేశాల శిఖరాగ్ర సమావేశాలకు హాజరు కావాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మోదీకి ఆహ్వానం పలికారు...
UK Invites PM Modi For G7: భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన ఆహ్వానం లభించింది. ఈ ఏడాది జరగనున్న జీ–7 దేశాల శిఖరాగ్ర సమావేశాలకు హాజరు కావాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మోదీకి ఆహ్వానం పలికారు. ఈ విషయాన్ని ఆదివారం బోరిస్ అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది జీ-7 శిఖరాగ్ర సమావేశాలను బ్రిటన్ వేదికగా జూన్ 11 నుంచి 13వ తేదీ వరకు జరపనున్నారు. ఈ సమావేశాలకు భారత్‌తోపాటు దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాలను ఆతిథ్య హోదాలో ఆహ్వానించామని బోరిస్ జాన్సన్ తెలిపారు. ఈసారి భారత్‌లో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరుకావాల్సి ఉండగా.. బ్రిటన్‌లో కరోనా సంక్షోభం కారణంగా ఆ పర్యటన రద్దయిందని బ్రిటన్ ప్రధాని చెప్పుకొచ్చారు. అయితే జీ-7 భేటీ కంటే ముందే భారత్‌లో పర్యటించే ఆలోచనలో ఉన్నామని ఆయన తెలిపారు. జీ 7 (గ్రూప్ ఆఫ్ సెవెన్) బృందంలో అమెరికా, యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాలున్నాయి. ఇక ఈ ఏడాది ఈ దేశాల మధ్య కోవిడ్ మహమ్మారిపైనే ప్రధాన చర్చ జరుగుతుందని భావిస్తున్నారు.
Also Read: అరుదైన ఘనత సాధించిన భారత సంతతి ప్రొఫెసర్.. అత్యధిక ఫెలోషిప్ అవార్డ్ అందించిన యూఎస్..