AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Inter: కీలక నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం… రాష్ట్రంలోని ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు రద్దు చేస్తూ..

AP Govt Key Decision On Intermediate: కరోనా కారణంగా గాడి తప్పిన విద్యా వ్యవస్థను మళ్లీ దారిలో పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ...

AP Inter: కీలక నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం... రాష్ట్రంలోని ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు రద్దు చేస్తూ..
Narender Vaitla
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Jan 18, 2021 | 7:22 AM

Share

AP Govt Key Decision On Intermediate: కరోనా కారణంగా గాడి తప్పిన విద్యా వ్యవస్థను మళ్లీ దారిలో పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే సోమవారం (జనవరి 18) నుంచి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులకు తరగతులు ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే సిలబస్‌ పూర్తి చేయడం, పరీక్షలు నిర్వహించేందుకుగాను రాష్ట్రంలోని ఇంటర్మీడియట్‌ కాలేజీలకు వేసవి సెలవులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మే 31 వరకూ తరగతులు జరుగుతాయని, రెండో శనివారాలు కూడా కాలేజీలు కొనసాగుతాయని పేర్కొంది. కరోనా కారణంగా విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం అవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక దీంతో పాటు పదో తరగతి విద్యార్థులకు సోమవారం నుంచి రెండు పూటలా తరగతులు జరగనున్నాయి. వీరికోసం ప్రత్యేంగా 103 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. జాతీయ, ఇతర పండుగలు మినహా ఆదివారాల్లో కూడా తరగతులు నిర్వహిస్తారు. ఆదివారం ఒక పూట ఒక సబ్జెక్టులో మాత్రమే తరగతులు జరుగుతాయి. అన్ని పాఠశాలల్లో సోమవారం నుంచి ఈ ప్రణాళికను అమలు చేయాలని డీఈవో సుబ్బారావు ఆదేశించారు.

Also Read: Tellam Balaraju dance: పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డ్యాన్స్‌.. సంక్రాంతి సంబరాల్లో భాగంగా డీజే స్టెప్పులు