Andhra Pradesh: పెంపుడు కోళ్ల విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవ.. కత్తులతో దాడి.. నలుగురికి గాయాలు..

Andhra Pradesh:మనిషికి మనిషికి మధ్య వివాదాలు ఏర్పడాలన్న.. గొడవలు జరగాలన్నా పెద్ద పెద్ద కారణాలు అక్కర్లేదు.. చిన్న అపార్ధం.. నాకు ఏంటి అన్న ఇగో చాలు.. అనర్ధాలను సృష్టించడానికి...

Andhra Pradesh: పెంపుడు కోళ్ల విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవ.. కత్తులతో దాడి.. నలుగురికి గాయాలు..
Pet Hens
Follow us
Surya Kala

|

Updated on: Jan 01, 2022 | 4:09 PM

Andhra Pradesh:మనిషికి మనిషికి మధ్య వివాదాలు ఏర్పడాలన్న.. గొడవలు జరగాలన్నా పెద్ద పెద్ద కారణాలు అక్కర్లేదు.. చిన్న అపార్ధం.. నాకు ఏంటి అన్న ఇగో చాలు.. అనర్ధాలను సృష్టించడానికి.. ఇప్పటి వరకూ ఆస్తుల కోసం, సరిహద్దుల కోసం గొడవపడిన ఇరుగుపొరుగు కుటుంబాల గురించి అనేక వార్తలు చూశాం.. తాజాగా పెంపుడు కోళ్ల విషయంలో టూ ఫ్యామిలీస్ మధ్య చోటు చేసుకున్న వివాదం.. ఏకంగా కొందరిని ఆస్పత్రి పాలు చేసింది. ఈ ఘటన కృష్ణ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

జిల్లాలోని వీరులపాడు మండలం చెన్నారావు పాలానికి చెందిన రెండు కుటుంబాల మధ్య పెంపుడు కోళ్ల విషయంలో వివాదం ఏర్పడింది. గత వారం రోజుల నుంచి ఇరు కుటుంబాల మధ్య నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ  నేపథ్యంలో నేడు ఇరు కుటుంబాలు ఏకంగా కత్తులతో దాడి చేసుకున్నారు. మీ కోళ్లు మా ఇంటివైపుకి వస్తున్నాయని ఒక ఫ్యామిలీ మరొక ఫ్యామిలీని ప్రశ్నించింది. కోళ్లను పెంచుకుంటున్న ఫ్యామిలీ పై పొరుగువారు గొడవకు దిగినట్లు బాధిత ఫ్యామిలీ చెబుతోంది. అది చూసిన తాము కోళ్ళు ఇంటివైపు వస్తున్నాయని తిడుతూ ఉన్న వారిని.. ఇదేమిటి అని  ప్రశ్నించినందుకు తమపై దాడి చేశారని బాధితులు చెబుతున్నారు.  ఈ దాడిలో నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం నందిగామ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.

Also Read:  ఈ ఏడాది అందరికీ షాక్ ఇస్తూ ‘నియంత కిమ్’ సరికొత్త నిర్ణయం.. అణ్వాయుధాలపై కాదు.. అభివృద్ధిపైనే దృష్టి అంటూ..