Lion Attack: ఒక్కసారిగా వ్యక్తిపైకి దూకిన సింహం.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
వన్య మృగాలు అంటే సాధారణంగా అందరికీ భయమే. అయితే వాటిని దగ్గరగా చూడాలనుకున్నప్పుడు.. జూకు వెళ్తాం.. అక్కడ బోనులో ఉన్న సింహాన్ని చూసి దగ్గరగా చూసిన ఆనందాన్ని పొందుతాం... అంతే కానీ దగ్గరికెళ్లి దాంతో సెల్ఫీ దిగుతాను.. అంటే దానికి ఆహారమైపోతారు.
వన్య మృగాలు అంటే సాధారణంగా అందరికీ భయమే. అయితే వాటిని దగ్గరగా చూడాలనుకున్నప్పుడు.. జూకు వెళ్తాం.. అక్కడ బోనులో ఉన్న సింహాన్ని చూసి దగ్గరగా చూసిన ఆనందాన్ని పొందుతాం… అంతే కానీ దగ్గరికెళ్లి దాంతో సెల్ఫీ దిగుతాను.. అంటే దానికి ఆహారమైపోతారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి సింహాన్ని కుక్క పిల్లలా ఆడిస్తున్నాడు. పెంపుడు జంతువు లాగా సింహంతో ఆడుతున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూస్తే సింహం అతనిపై దాడి చేస్తుందేమో అని భయమేస్తుంది.ఈ వీడియోలో ఒక బోనులో ఉంది సింహం. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి ఆ బోను డోర్ ఓపెన్ చేశాడు.. అంతే ఒక్క ఉదుటన ఆ సింహం అతనిపైకి దూకింది. దాంతో అతను సింహంతో సహా కింద పడిపోయాడు. ఈ ఘటన చూస్తే నిజంగా భయమేస్తుంది. ఆ సింహం అతన్ని తినేస్తుందేమో అని. కానీ అది ఆ వ్యక్తిని పలకరింపుగా కౌగలించుకుందట. వాళ్లిద్దరికీ అది మామూలేనట. దక్షిణాఫ్రికాలోని కలహరి ఎడారిలో రిజర్వ్‌లో సిర్గా అనే సింహానికి అతను సంరక్షకుడు. 9 ఏళ్లుగా ఆ సింహానికి అతను సంరక్షకుడిగా ఉన్నారు. అతను తరచుగా ఈ సింహానికి సంబంధించిన చిత్రాలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటాడు. ఇటీవల ఈ వీడియోను సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేసాడు. ఈ వీడియోను వీక్షిస్తున్న లక్షల మంది నెటిజన్లు తెగ లైక్ చేస్తున్నారు. వారి స్నేహానికి ఫిదా అవుతున్నారు.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

