AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona: క‌ష్ట స‌మ‌యంలో ఉద్యోగుల‌కు అండ‌గా నిలిచిన ప్రిస్టేజ్‌.. కొవిడ్ కార‌ణంగా మ‌ర‌ణించిన ఉద్యోగి కుటుంబానికి..

Corona: క‌రోనా సెకండ్ సేవ్ భార‌త్‌ను అత‌లాకుతలం చేస్తోంది. ఎంతో మంది ప్రాణాల‌ను బలిగొంటోందీ మాయ‌దారి రోగం. ఇంటి పెద్ద‌ను కోల్పోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. క‌రోనా మ‌య‌దారి రోగం...

Corona: క‌ష్ట స‌మ‌యంలో ఉద్యోగుల‌కు అండ‌గా నిలిచిన ప్రిస్టేజ్‌.. కొవిడ్ కార‌ణంగా మ‌ర‌ణించిన ఉద్యోగి కుటుంబానికి..
Prestige Help Employees
Narender Vaitla
| Edited By: Team Veegam|

Updated on: May 29, 2021 | 10:49 PM

Share

Corona: క‌రోనా సెకండ్ సేవ్ భార‌త్‌ను అత‌లాకుతలం చేస్తోంది. ఎంతో మంది ప్రాణాల‌ను బలిగొంటోందీ మాయ‌దారి రోగం. ఇంటి పెద్ద‌ను కోల్పోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. క‌రోనా మ‌య‌దారి రోగం దేశంలో ఎంతో మంది జీవితాల‌ను ప్ర‌శ్నార్థ‌కంగా మార్చేస్తోంది. ఈ క్ర‌మంలోనే త‌మ సంస్థ కోసం ప‌నిచేసిన ఉద్యోగుల‌కు అండ‌గా నిలుస్తున్నాయి కొన్ని కంపెనీలు. ఇందులో భాగంగానే టాటా కంపెనీ ఇటీవ‌ల త‌మ కంపెనీలో ప‌నిచేసి క‌రోనాతో మ‌ర‌ణించిన ఉద్యోగి కుటుంబానికి స‌ద‌రు ఉద్యోగి రిటైర్మెంట్ వ‌య‌సు వ‌ర‌కు జీతాన్ని అందించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం విధిత‌మే. తాజాగా ఈ జాబితాలోకి మ‌రో సంస్థ వ‌చ్చి చేరింది. క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించిన త‌మ ఉద్యోగుల కుటుంబాల‌కు అండ‌గా నిల‌వ‌నున్న‌ట్లు.. గృహోపకరణాల తయారీ సంస్థ టీటీకే ప్రిస్టేజ్‌ ప్రకటించింది. ఉద్యోగుల్లో ఎవరైనా కొవిడ్‌ కారణంగా మరణిస్తే ఏడాది పాటు పూర్తి వేతనం, రెండో ఏడాది 50 శాతం వేతనం చెల్లించ‌నున్నట్లు సంస్థ ఛైర్మ‌న్ టీటీ జ‌గ‌న్నాథ‌న్ తెలిపారు. అలాగే ఉద్యోగి మరణించిన నాటి నుంచి వారి కుటుంబ సభ్యులకు రెండేళ్ల పాటు మెడికల్‌ ఇన్సూరెన్స్ చెల్లించ‌నున్నారు. ఇంత‌టితో ఆగ‌కుండా.. చనిపోయిన ఉద్యోగి స్థానంలో వారి కుటుంబీకుల్లో ఎవరికైనా విద్యార్హతలు ఉంటే వారికి శిక్షణనిచ్చి ఉద్యోగం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇక‌ ఉద్యోగితో పాటు కుటుంబీకులకు వ్యాక్సినేషన్‌ చేయించనున్నట్లు సంస్థ ప్ర‌తినిధులు తెలిపారు. ప్రతి ఉద్యోగి, వారి కుటుంబాన్ని కాపాడుకోవటం సంస్థ బాధ్యతని చెప్పుకొచ్చారు. ఇలాంటి క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్రిస్టేజ్ తీసుకున్న ఈ నిర్ణ‌యం నిజంగానే అభినంద‌నీయం క‌దూ..!

Also Read: Viral News: ఓ ఇంట్లో 8 పాము గుడ్లు కంట‌ప‌డ్డాయి.. ఇతడు అక్క‌డికి వెళ్లి, ఏం చేశాడంటే…

China Scientists: కరోనా పాపానికి కారకులు చైనా పరిశోధకులే..ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనలో స్పష్టం!

Viral News: నాగుపాముకి నోటితో ఆక్సిజన్​.. కొనఊపిరితో ఉన్న స‌ర్పానికి మళ్లీ ప్రాణం పోసిన వ్య‌క్తి