Viral News: నాగుపాముకి నోటితో ఆక్సిజన్.. కొనఊపిరితో ఉన్న సర్పానికి మళ్లీ ప్రాణం పోసిన వ్యక్తి
పామును చూస్తే.. ఒక్క ఉదుటన అవతలకు దూకేవాళ్లు.. లేదంటే కర్ర అందుకుని దాని ఊపిరి తీసేవాళ్లను మీరు చూసుంటారు. కానీ, ఓ వ్యక్తి...
పామును చూస్తే.. ఒక్క ఉదుటన అవతలకు దూకేవాళ్లు.. లేదంటే కర్ర అందుకుని దాని ఊపిరి తీసేవాళ్లను మీరు చూసుంటారు. కానీ, ఓ వ్యక్తి చావు బ్రతుకుల్లో ఉన్న ఓ నాగుపాము (కోబ్రా)కు నోటితో ఆక్సిజన్ అందించి రక్షించాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన ఒడిశా మల్కన్‌గిరి జిల్లాలో జరిగింది. నువాగూడ షాహీలో ఓ వ్యక్తి తన ఇంట్లోకి పాము ప్రవేశించింది. దీంతో ఆ వ్యక్తి సహాయం కోసం స్నేక్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాడు. అక్కడికి చేరుకున్న సిబ్బంది.. ఆ పాము ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. పాకలేని స్థితిలో సొమ్మసిల్లిపోయి ఉన్న కోబ్రాకు.. స్నేహాశీష్ అనే హెల్ప్‌లైన్ మెంబర్ చిన్న పైపు సాయంతో నోటితో గాలి ఊదాడు. దీంతో కాసేపటికి ఆ పాములో చలనం కనిపించింది.ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సకాలంలో స్పందించి పాము ప్రాణాలు రక్షించిన.. స్నేహాశీష్‌పై ప్రశంసలు కురుస్తున్నారు నెటిజన్లు.
కరోనాకు మందు అంటూ పామును తిన్నాడు!
కొవిడ్‌కు ఇదే మందు అంటూ చనిపోయిన సర్పాన్ని ఓ వ్యక్తి తిన్న వింత ఘటన తమిళనాడులోని మధురై జిల్లాలో ఇటీవల చోటుచేసుకుంది. పెరుమల్ పట్టి గ్రామానికి చెందిన వడివేలు అనే రైతు చేసిన పని స్థానికులకు గగుర్పాటకు గురిచేసింది. ఆ దృశ్యాలు పక్కనే ఉన్న వ్యక్తి మెబైల్ పోన్లో రికార్డు చేయగా.. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు వ్యక్తిపై పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు వడివేలును అరెస్టు చేశారు. అతడికి రూ.7,500 జరిమానా కూడా విధించారు. వడివేలును విచారించగా.. పామును పొలంలో పట్టుకున్నానని, చంపిన తర్వాతే తిన్నానన్నాడు. ఆ సమయంలో మద్యం సేవించడంతోనే అలా చేశానని చెప్పాడు.
Also Read: కోళ్లను ముద్దు చేస్తున్నారా….. వాటి ద్వారా కొత్త ఇన్‌ఫెక్షన్.. సీడీసీ హెచ్చరిక
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతు బంధు సాయం పంపిణీకి డేట్ పిక్స్