శ్రీవాణి ట్రస్ట్‌కు రూ.10 వేలు విరాళం ఇస్తే… విఐపీ బ్రేక్ దర్శనం!
శ్రీవాణి ట్రస్ట్‌కు రూ.10 వేలు, ఆపైన విరాళం ఇచ్చే దాతలకు సిఫార్సుతో పని లేకుండా వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించే విధానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అదనపు ఈవో ధర్మారెడ్డి అక్టోబర్ 21వ తేదీన ప్రారంభించారు. ట్రస్ట్ గోకులం సముదాయంలో ఇది అందుబాటులోకి వచ్చింది. నెల రోజుల అధ్యయనం తర్వాత దీనిని ప్రారంభించారు. ఈ ట్రస్ట్‌కు రూ.10,000 నుంచి రూ.99,000 వేల వరకు చెల్లించే దాతలకు ప్రత్యేక ప్రివిలేజ్ కింద బ్రేక్ దర్శనం టికెట్ కేటాయించాలని […]

శ్రీవాణి ట్రస్ట్‌కు రూ.10 వేలు, ఆపైన విరాళం ఇచ్చే దాతలకు సిఫార్సుతో పని లేకుండా వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించే విధానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అదనపు ఈవో ధర్మారెడ్డి అక్టోబర్ 21వ తేదీన ప్రారంభించారు. ట్రస్ట్ గోకులం సముదాయంలో ఇది అందుబాటులోకి వచ్చింది. నెల రోజుల అధ్యయనం తర్వాత దీనిని ప్రారంభించారు.
ఈ ట్రస్ట్‌కు రూ.10,000 నుంచి రూ.99,000 వేల వరకు చెల్లించే దాతలకు ప్రత్యేక ప్రివిలేజ్ కింద బ్రేక్ దర్శనం టికెట్ కేటాయించాలని గతంలో TTD నిర్ణయించింది. ఈ మేరకు అదనపు ఈవో మాట్లాడుతూ.. ఈ ట్రస్టుకు రూ.10వేలు విరాళం ఇస్తే భక్తుడికి ఒక విఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్ ఇస్తామని, ప్రోటోకాల్ మర్యాదలతో దర్శనం ఉంటుందన్నారు. భక్తులు ఇచ్చే విరాళం రూ.1 లక్ష దాటితే ఆ మేరకు ఇతర పథకాలపై ఉన్న హక్కులు కూడా వర్తిస్తాయని తెలిపారు. దీనిని ప్రయోగాత్మకంగా ప్రారంభించినట్లు తెలిపారు. భక్తుల స్పందన ఆధారంగా కోటా నిర్ణయిస్తామని, నెల ముందే కోటాను తెలియజేస్తామని చెప్పారు.
తిరుమల తిరుపతి దేవస్థానం యాప్, వెబ్ సైట్ ద్వారా రానున్న పదిహేను రోజుల పాటు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వీఐపీ దర్శనం బుకింగ్ స్లాట్‌లో నమోదు చేసుకోవచ్చు. అలాగే, విరాళం అందించిన భక్తులకు ఆరు నెలల్లో దర్శనం ఉంటుంది. శ్రీవాణి ట్రస్టుకు రూ.10వేలు విరాణం ఇచ్చిన దాతలకు ఒక బ్రేక్ దర్శన టిక్కెట్ ప్రివిలేజ్‌గా ఒకసారి మాత్రమే అందిస్తారు. వెంటనే సదరు దాతలు రూ.500 చెల్లించి బ్రేక్ దర్సన టిక్కెట్ కొనుగోలు చేయవచ్చు.