AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టిడిపిలో మరో వికెట్ ఫట్.. గంటా బాటలోనే యామిని ?

ఏపీ నేతలు పొలిటికల్ మైగ్రేషన్‌లో పోటీ పడుతున్నారు. ముఖ్యంగా టిడిపి గూటి నుంచి బయట పడేందుకు తెలుగు తమ్ముళ్ళు పోటీ పడుతుంటే మేమేమీ తీసిపోలేదని తెలుగు చెల్లెమ్మలు దూకుడు ప్రదర్శిస్తున్నారు. టిడిపి గూటి నుంచి బయటికొచ్చే వారు అయితే బిజెపిలోనే.. లేకపోతే వైసీపీలోనో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. తాజాగా టిడిపి అధికార ప్రతినిధిగా మొన్నటి ఎన్నికల దాకా ప్రసార మాధ్యమాలలో అదర గొట్టిన సాధినేని యామిని తెలుగుదేశం పార్టీకి, రాష్ట్ర అధికార ప్రతినిధి పోస్టుకు రాజీనామా […]

టిడిపిలో మరో వికెట్ ఫట్.. గంటా బాటలోనే యామిని ?
Rajesh Sharma
| Edited By: |

Updated on: Nov 07, 2019 | 8:25 PM

Share
ఏపీ నేతలు పొలిటికల్ మైగ్రేషన్‌లో పోటీ పడుతున్నారు. ముఖ్యంగా టిడిపి గూటి నుంచి బయట పడేందుకు తెలుగు తమ్ముళ్ళు పోటీ పడుతుంటే మేమేమీ తీసిపోలేదని తెలుగు చెల్లెమ్మలు దూకుడు ప్రదర్శిస్తున్నారు. టిడిపి గూటి నుంచి బయటికొచ్చే వారు అయితే బిజెపిలోనే.. లేకపోతే వైసీపీలోనో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.
తాజాగా టిడిపి అధికార ప్రతినిధిగా మొన్నటి ఎన్నికల దాకా ప్రసార మాధ్యమాలలో అదర గొట్టిన సాధినేని యామిని తెలుగుదేశం పార్టీకి, రాష్ట్ర అధికార ప్రతినిధి పోస్టుకు రాజీనామా చేశారు. గురువారం మధ్యాహ్నం తాను స్వదస్తూరితో రాసిన లేఖను టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు పంపించారు. వ్యక్తిగత కారణాలతోపాటు దేశ, రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నట్లు యామిని ప్రకటించారు. ప్రస్తుతానికి భవిష్యత్ కార్యాచరణపై ఇంకా ఏమీ అనుకోలేదని, త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటానని ఆమె చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
అయితే.. సాధినేని యామిని శర్మ త్వరలో బిజెపిలో చేరతారని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆల్‌రెడీ బిజెపి రాష్ట్ర నాయకత్వంతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. బిజెపి ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో మాట్లాడి తన ఆసక్తులను వివరించగా.. ఆయన అంగీకరించడంతో టిడిపికి రాజీనామా చేసారని, రెండు, మూడు రోజుల్లో అంటే నవంబర్ 10న బిజెపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.పి. నడ్డా సమక్షంలో యామిని బిజెపిలో  చేరతారని అంటున్నారు. రెండురోజుల్లో రానున్న నడ్డా.. పర్యటన అత్యంత కీలకం కాబోతున్నట్లు సమాచారం. మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు చేరిక అంశం కూడా నడ్డా పర్యటనలో తేలిపోనుంది.
కాగా.. యామిని మొన్నటి ఎన్నికలకు ముందే టిడిపిలో పూర్తి నిరాశకు గురయ్యారని సమాచారం. గుంటూరు నగరంలో తన సామాజిక వర్గం ఓట్లు అధికంగా వుండడంతో అక్కడ్నించి అసెంబ్లీకి పోటీచేయాలని చంద్రబాబు నాయుడుని యామిని సంప్రదించగా.. ఆయన పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో కినుక వహించారు యామిని. అయితే.. చంద్రబాబు స్వయంగా బుజ్జగించడంతో అప్పట్లో పార్టీకి దూరమవ్వాలనే ఆలోచనను అప్పట్లో పక్కన పెట్టారు. అయితే.. సోషల్ మీడియాలో యామిని మీద విపరీత స్థాయిలో ట్రోలింగ్ జరగడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఏపీ డిజిపిని కలిసి చర్యలు తీసుకోవాలని విఙ్ఞప్తి చేశారు.
తాజాగా టిడిపి పరిస్థితి రోజురోజుకూ వీక్ అవుతున్న తరుణంలో తాను కూడా బెటర్ ఆల్టర్నేటివ్ చూసుకోవడం మంచిదన్న ఉద్దేశంతో బిజెపి నేతలను సంప్రదించినట్లు తెలుస్తోంది. బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పోస్టుతోపాటు.. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కన్‌ఫర్మ్  చేయడంతో బిజెపిలో  చేరేందుకు యామిని శర్మ సిద్దమైనట్లు తెలుస్తోంది.

అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే