TTD Kalyanamastu: బంగారం లాంటి వార్త చెప్పిన టీటీడీ.. వారికి గ్రాము కాదు, రెండు గ్రాముల గోల్డ్

 పదేళ్ల క్రితం ఆపేసిన కళ్యాణమస్తు కార్యక్రమాన్ని టీటీడీ పున:ప్రారంభించిన విషయం  తెలిసిందే. కాగా ఈ కార్యక్రమ లబ్దిదారులకు మరో శుభవార్త చెప్పింది టీటీడీ.

TTD Kalyanamastu: బంగారం లాంటి వార్త చెప్పిన టీటీడీ.. వారికి గ్రాము కాదు, రెండు గ్రాముల గోల్డ్
Ttd Kalyanamasthu
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 18, 2021 | 12:23 PM

పదేళ్ల క్రితం ఆపేసిన కళ్యాణమస్తు కార్యక్రమాన్ని టీటీడీ పున:ప్రారంభించిన విషయం  తెలిసిందే. కాగా ఈ కార్యక్రమ లబ్దిదారులకు మరో శుభవార్త చెప్పింది టీటీడీ. తాళిబొట్టు బంగారాన్ని ఒక గ్రాము నుంచి రెండు గ్రాములకు పెంచుతున్నట్లు వెల్లడించింది.  ట్రెజరీలోని 20వేల బంగారు తాళిబొట్లను కళ్యాణమస్తు కార్యక్రమానికి ఉపయోగించనున్నారు. పేద హిందువులు శ్రీవారి సమక్షంలో వివాహం చేసుకునే ఈ కార్యక్రమం ద్వారా కల్పించింది టీటీడీ. కల్యాణమస్తును తిరిగి మే 28న ప్రారంభించనున్నారు.

2007లో దివంగత ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ కల్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉంటాయనే భావనతో వేలాది జంటలు ఈ కార్యక్రమంలో దాంపత్య జీవింతంలోకి అడుగుపెట్టేవి. కాగా కల్యాణమస్తులో పెళ్లి చేసుకున్న జంటకు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున వధూవరులకు నూతన వస్త్రాలు, బంగారు తాళి బొట్టు ఇవ్వడంతోపాటు..వారి బంధువులు 50 మందికి ఉచితంగా భోజనాలు పెట్టేవారు.