తగ్గేదెవరు.. ప్రభుత్వమా.. కార్మికులా..?

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గ్రహించిన హైకోర్టు.. కార్మికులకు చివాట్లు పెట్టింది. ప్రభుత్వానికి బాధ్యత గుర్తు చేసింది. దీనిపై వాదనలు విన్నది. ప్రభుత్వం, ఆర్టీసీ యూనియన్లు దీనిపై చర్చలు జరిపి రెండు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు తీర్పుతో సమస్య పరిష్కారం పై అందరిలోనూ ఆశలు చిగురించాయి. అయితే ఇప్పటి వరకూ ప్రభుత్వం కాని, ఆర్టీసీ యూనియన్లు గాని చర్చలకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. పైగా, సమ్మె […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:28 pm, Wed, 16 October 19
తగ్గేదెవరు.. ప్రభుత్వమా.. కార్మికులా..?

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గ్రహించిన హైకోర్టు.. కార్మికులకు చివాట్లు పెట్టింది. ప్రభుత్వానికి బాధ్యత గుర్తు చేసింది. దీనిపై వాదనలు విన్నది. ప్రభుత్వం, ఆర్టీసీ యూనియన్లు దీనిపై చర్చలు జరిపి రెండు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు తీర్పుతో సమస్య పరిష్కారం పై అందరిలోనూ ఆశలు చిగురించాయి. అయితే ఇప్పటి వరకూ ప్రభుత్వం కాని, ఆర్టీసీ యూనియన్లు గాని చర్చలకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. పైగా, సమ్మె విరమించేది లేదని.. చర్చలు జరిపిన తర్వాతే సమ్మె విరమిస్తామని కార్మిక సంఘాలు కుండ బద్దలు కొడుతున్నాయి. కోర్టు ఆదేశాన్ని దిక్కరిస్తున్నాయి.

కాగా, సమ్మెలో ఉన్న కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రభుత్వం చేసిన ప్రకటన వల్ల.. కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆర్టీసీ యూనియన్ కోర్టుకు వెల్లడించింది. తమ సమస్యలను పట్టించుకోకపోవడంతోనే సమ్మెకు దిగామని.. ఇందుకు సంబంధించి ముందుగానే సమ్మె నోటీసు కూడా ఇచ్చామని అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని వారు తెలిపారు. కాగా, సమ్మె అస్రాన్ని ప్రయోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని కోర్టు తెలిపింది.

ఇక అదే సమయంలో, గత 12 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నారు. సమ్మె విరమించుకోవడానికి ఏం చర్యలు చేపట్టిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అంతేకాదు ఆర్టీసీకి పూర్తిస్థాయి ఎండీని నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వెంటనే ప్రభుత్వం, కార్మికులు ఓ మెట్టు దిగి చర్చలు ప్రారంభించాలని తెలిపింది. తొందరపడి కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించింది. తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేస్తూ కోర్టు తీర్పు నిచ్చింది.

మరోవైపు టీఆర్ఎస్ ఎంపీ కె కేశవరావు తెగ హడావుడి చేశారు. కార్మికుల సమ్మెకి.. ప్రభుత్వానికి మధ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తానంటూ ముందుకొచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశిస్తే సమస్యను పరిష్కరిస్తానని చెప్పుకొచ్చారు. కాని ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సైలెంట్ అయ్యారు. మరి ఇప్పటికైనా సమ్మె వివాదం ఆగుతుందా.. లేక కొనసాగుతుందా చూడాలి. కోర్టు నిర్దేశించిన గడువు గురువారం సాయంత్రంతో ముగుస్తుంది. ఈలోగా చర్చల దిశగా తొలి అడుగు ఎవరు వేస్తారనేది ఆసక్తిగా మారింది. తాజాగా ఆర్టీసీ జేఏసీ.. మంత్రి పువ్వాడ అజయ్‌తో భేటీ అయినట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పై ఇరువురు సమీక్షించారు. సోమవారం నుంచి విద్యాసంస్థలు ప్రారంభం అవుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు.