ప్రేమించమని.. కత్తితో పొడిచాడు..!
పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం కవిటంలో దారుణం జరిగింది. సుధాకర్ అనే వ్యక్తి.. తేజశ్రీ(20) అనే యువతిని కత్తితో పొడిచాడు.. అనంతరం అతను కూడా.. పురుగుల మందు తాగాడు. దీంతో.. వీరిద్దరినీ.. స్థానికులు పాలకొల్లు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి కూడా.. విషమంగా ఉంది. తేజశ్రీ ప్రస్తుతం ఎంఎస్సీ చదువుతోంది. రోజూలాగే.. ఈ రోజు కూడా కాలేజీకి బయలుదేరింది. తనను కొద్ది రోజులుగా.. ప్రేమిస్తున్నానంటూ.. వెంటపడి వేధిస్తున్నాడు సుధాకర్. ఆమె ప్రేమకి నిరాకరించడంతో.. చివరికి […]
పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం కవిటంలో దారుణం జరిగింది. సుధాకర్ అనే వ్యక్తి.. తేజశ్రీ(20) అనే యువతిని కత్తితో పొడిచాడు.. అనంతరం అతను కూడా.. పురుగుల మందు తాగాడు. దీంతో.. వీరిద్దరినీ.. స్థానికులు పాలకొల్లు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి కూడా.. విషమంగా ఉంది. తేజశ్రీ ప్రస్తుతం ఎంఎస్సీ చదువుతోంది. రోజూలాగే.. ఈ రోజు కూడా కాలేజీకి బయలుదేరింది. తనను కొద్ది రోజులుగా.. ప్రేమిస్తున్నానంటూ.. వెంటపడి వేధిస్తున్నాడు సుధాకర్. ఆమె ప్రేమకి నిరాకరించడంతో.. చివరికి కత్తితో దాడి చేశాడు. సుధాకర్‌కి ముందే పెళ్లి అయి.. విడాకులు అయ్యాయి.