Hyderabad: ఓఆర్‌ఆర్‌ను తలదన్నేలా ఆర్‌ఆర్‌ఆర్‌.. ఎల్ఈడీ విద్యుద్దీపాల ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌..

ఔటర్‌ రింగ్‌రోడ్డును మరిపించేలా రీజినల్‌ రింగ్‌రోడ్డు(RRR)ను నిర్మి్స్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పటాన్‌చెరు ఇంటర్‌ఛేంజ్‌ వద్ద ఔటర్‌ రింగురోడ్డుపై ఏర్పాటుచేసిన ఎల్ఈడీ విద్యుత్‌ దీపాలను మంత్రి ప్రారంభించారు

Hyderabad: ఓఆర్‌ఆర్‌ను తలదన్నేలా ఆర్‌ఆర్‌ఆర్‌.. ఎల్ఈడీ విద్యుద్దీపాల ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌..
Follow us

|

Updated on: Dec 17, 2021 | 10:14 AM

ఔటర్‌ రింగ్‌రోడ్డును మరిపించేలా రీజినల్‌ రింగ్‌రోడ్డు(RRR)ను నిర్మి్స్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పటాన్‌చెరు ఇంటర్‌ఛేంజ్‌ వద్ద ఔటర్‌ రింగురోడ్డుపై ఏర్పాటుచేసిన ఎల్ఈడీ విద్యుత్‌ దీపాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో ఓఆర్‌ఆర్‌ చివరి అంకం దిగ్విజయంగా పూర్తయిందని…త్వరలో RRR కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ సందర్భంగా ఓఆర్‌ఆర్‌పై ఎంతో అద్భుతంగా విద్యుద్దీపాలను అమర్చిన హెచ్‌ఎండీఏ అధికారులు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఔటర్‌ రింగు రోడ్డులో జరిగే ప్రమాదాలకు చెక్‌ పెట్టి సురక్షిత ప్రయాణం కల్పించేందుకే ఈ ఎల్‌ఈడీ బల్బులను ఏర్పాటుచేశామని కేటీఆర్‌ పేర్కొన్నారు. కాగా ఓఆర్‌ఆర్‌లో వెళ్లే వాహనాలు రాత్రిపూట తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. వీటిని నియంత్రించేందుకే హెచ్‌ఎండీఏ – హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ఓఆర్‌ఆర్‌ వెంట ఈ ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు.

జిగేల్‌ మంటోన్న ఔటర్‌ రహదారులు.. మొత్తం 158 కిలోమీటర్లు ఉండే రింగ్‌ రోడ్డులో కొంతభాగం అంటే గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ మధ్య రూ. 30 కోట్ల ఖర్చుతో 2018లో 22 కిలోమీటర్ల మేర ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ చొరవతో మిగతా 136 కిలోమీటర్ల మేర ఎల్‌ఈడీ విద్యుద్దీపాలను ఏర్పాటు చేశారు. ఔటర్‌ రింగ్ రోడ్డుపై మొత్తం నాలుగు దశల్లో సుమారు వందకోట్ల రూపాయలతో వీటిని ఏర్పాటు చేశారు. సుమారు 136 కిలోమీటర్ల మేర ఓఆర్‌ఆర్‌ రోడ్డుపై జంక్షన్లు, అండర్‌పాసులు, రెండు వైపులా ఉన్న సర్వీస్‌ రోడ్లలో కొత్తగా 6,340 ఎలక్ర్టిక్‌ స్తంభాలను ఏర్పాటుచేశారు. వీటికి మొత్తం 13,392 ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఎల్‌ఈడీ లైట్ల వెలుతురుతో రాత్రిపూట బాహ్యవలయం రహదారి జిగేల్‌ మంటోంది. ఎల్‌ఈడీ లైట్ల ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌తో పాటు సబితాఇంద్రారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read:

Burning Topic LIVE : సభలతో సమరం.. టి.ఆర్.ఎస్ తో ఢీ.. కాంగ్రెస్ లో ఎస్..(వీడియో)

Telangana: నేడు టీఆర్‌ఎస్‌ నేతలతో కేసీఆర్‌ విస్తృత స్థాయి సమావేశం.. చర్చకు రానున్న పలు కీలక అంశాలు..

Warangal: బంధువులను బినామీలుగా పెట్టి భూమి డబుల్‌ రిజిస్ట్రేషన్‌.. ఇద్దరు సీఐలపై కేసులు నమోదు..