ఇంజినీరింగ్‌ వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ వాయిదా!

తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మరోసారి వాయిదా పడింది. ఫీజుల పెంపు వ్యవహారం ఇంకా కొలిక్కి రాకపోవడంతో శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన వెబ్ ఆప్షన్లను ప్రక్రియను శనివారం నుంచి చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. దీంతో ఈ నెల 6 నుంచి 8వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఇప్పటివరకు 23,755 మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 183 కళాశాలల్లో 91,270 ఇంజినీరింగ్‌ సీట్ల భర్తీకి ఏఐసీటీఈ, […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:37 pm, Thu, 4 July 19
ఇంజినీరింగ్‌ వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ వాయిదా!

తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మరోసారి వాయిదా పడింది. ఫీజుల పెంపు వ్యవహారం ఇంకా కొలిక్కి రాకపోవడంతో శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన వెబ్ ఆప్షన్లను ప్రక్రియను శనివారం నుంచి చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. దీంతో ఈ నెల 6 నుంచి 8వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఇప్పటివరకు 23,755 మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 183 కళాశాలల్లో 91,270 ఇంజినీరింగ్‌ సీట్ల భర్తీకి ఏఐసీటీఈ, యూనివర్సిటీలు అనుమతినిచ్చాయి. 14 ప్రభుత్వ కళాశాలల్లో 3071 ఇంజినీరింగ్‌ సీట్లు భర్తీకి అవకాశమివ్వగా.. 169 ప్రైవేటు కళాశాలల్లో 88,199 ఇంజినీరింగ్‌ సీట్లు భర్తీకి అనుమతినిచ్చాయి. కన్వీనర్‌ కోటాలో రాష్ట్రవ్యాప్తంగా 64,709 సీట్లు భర్తీ చేయనున్నారు.