డిప్యూటీ కలెక్టర్‌గా సింధూ సుబ్రహ్మణ్యం నియామకం

ఏపీ సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో డిప్యూటీ కలెక్టర్‌గా సింధు సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఐఎఎస్ అధికారి సుబ్రహ్మణ్యం కుమార్తె సింధు సుబ్రహ్మణ్యంకు గ్రూప్ వన్ ఉద్యోగమిస్తూ ఆదేశాలు జారీచేసింది ఏపీ ప్రభుత్వం. కారుణ్యనియామకం కింద సింధూ సుబ్రహ్మణ్యంకు ఈ ఉద్యోగాన్ని ప్రభుత్వం ఇచ్చింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హెలీకాప్టర్ ప్రమాదానికి గురైనప్పుడు ఆయన సెక్రటరీ సుబ్రహ్మణ్యం కూడా ఆయనతోపాటు ఉన్నారు. దీంతో కారుణ్య […]

డిప్యూటీ కలెక్టర్‌గా సింధూ సుబ్రహ్మణ్యం నియామకం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 04, 2019 | 10:21 PM

ఏపీ సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో డిప్యూటీ కలెక్టర్‌గా సింధు సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఐఎఎస్ అధికారి సుబ్రహ్మణ్యం కుమార్తె సింధు సుబ్రహ్మణ్యంకు గ్రూప్ వన్ ఉద్యోగమిస్తూ ఆదేశాలు జారీచేసింది ఏపీ ప్రభుత్వం. కారుణ్యనియామకం కింద సింధూ సుబ్రహ్మణ్యంకు ఈ ఉద్యోగాన్ని ప్రభుత్వం ఇచ్చింది.

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హెలీకాప్టర్ ప్రమాదానికి గురైనప్పుడు ఆయన సెక్రటరీ సుబ్రహ్మణ్యం కూడా ఆయనతోపాటు ఉన్నారు. దీంతో కారుణ్య నియామకాల్లో భాగంగా ఏపీ సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఆమెకు డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.