ఇసుక విక్రయాలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

బంగారంలా మారిపోయిన ఇసుకపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఇసుక విధానంపై మంత్రులు, అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఇసుక అమ్మకాలపై కొత్త మార్గదర్శకాలపై చర్చించారు. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఇసుకను ఏపీఎండీసీ ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది . నూతన ఇసుక విధానం సెప్టెంబరు 5 నుంచి అమల్లోకి రానుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ఇసుక రీచ్‌ల […]

ఇసుక విక్రయాలపై ఏపీ సర్కార్  కీలక నిర్ణయం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 04, 2019 | 8:48 PM

బంగారంలా మారిపోయిన ఇసుకపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఇసుక విధానంపై మంత్రులు, అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఇసుక అమ్మకాలపై కొత్త మార్గదర్శకాలపై చర్చించారు. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఇసుకను ఏపీఎండీసీ ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది . నూతన ఇసుక విధానం సెప్టెంబరు 5 నుంచి అమల్లోకి రానుంది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ఇసుక రీచ్‌ల వద్ద స్టాక్‌యార్డులు, నగరాలు, పట్టణాల్లో అదనపు స్టాక్‌యార్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే ఇసుక రీచ్‌ నుంచి స్టాక్‌యార్డు వద్దకు తరలింపునకు ఒక రశీదును ఇవ్వాలని.. రీచ్‌లవద్ద సీసీ కెమెరాల ఏర్పాటు చేసి , వే బ్రిడ్జిల ద్వారా లెక్కింపు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇసుక తవ్వకాలు, తరలింపులో వాడే వాహనాలకు జీపీఎస్‌ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు.

మాఫియాకు, అక్రమాలకు, అవకతవకలకు, కల్తీలకు చెక్ పెడుతూ పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. సామాన్యుడికి అవసరమైన విధంగా ప్రస్తుతం లభిస్తున్న రేట్లకన్నా తక్కువ రేట్లకే ఇసుకను అందించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక అమ్మకాలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపధ్యంలో కొత్త ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది.