రేపు ప్రకాశం జిల్లాకు రానున్న చంద్రబాబు
ఎట్టకేలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజల మధ్య మరో యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. శుక్రవారం ఆయన ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ శ్రేణులపై ప్రత్యక్ష దాడులు పెరిగిపోయాయని ఆరోపిస్తున్న టీడీపీ.. ఈ దాడుల్లో గాయపడ్డ టీడీపీ కార్యకర్తలను పరామర్శించాలని భావించింది. దీనిలోభాగంగానే చంద్రబాబు భరోసా యాత్ర చేపట్టనున్నారు . ఈనెల 5న ప్రకాశం జిల్లానుంచి ఈ భరోసా యాత్ర ప్రారంభం కానుంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 8 […]
ఎట్టకేలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజల మధ్య మరో యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. శుక్రవారం ఆయన ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ శ్రేణులపై ప్రత్యక్ష దాడులు పెరిగిపోయాయని ఆరోపిస్తున్న టీడీపీ.. ఈ దాడుల్లో గాయపడ్డ టీడీపీ కార్యకర్తలను పరామర్శించాలని భావించింది. దీనిలోభాగంగానే చంద్రబాబు భరోసా యాత్ర చేపట్టనున్నారు .
ఈనెల 5న ప్రకాశం జిల్లానుంచి ఈ భరోసా యాత్ర ప్రారంభం కానుంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 8 గంటలకు ప్రకాశం జిల్లా చినగంజాం మండలం రుద్రాంబపురం గ్రామానికి చేరుకుంటారు. అక్కడి నుంచి భరోసా యాత్రను ప్రారంభిస్తారు. ఉదయం 10.30 నుంచి 11.30 వరకు వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడ్డ టీడీపీ కార్యకర్తను ఆయన పరామర్శిస్తారు. అలాగే జిల్లా నేతలతో కూడా సమావేశమై భవిష్యత్తు కార్యచరణపై మాట్లాడనున్నారు.