కేజీ టమాటా ధర రూ. 300లు..ఎక్కడంటే..!

కేజీ టమాటా ధర రూ. 300లు..ఎక్కడంటే..!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మండిపోతున్న ఉల్లి ధరలు..కోయ కుండానే వినియోగదారులకు కన్నీళ్లు పుట్టిస్తున్నాయి. కానీ, అక్కడ మాత్రం టమాట ఠారెత్తిస్తోంది. ఏకంగా కిలో టమాటా ధర రూ. 300లకు చేరటంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. దీంతో సీరియస్‌గా తీసుకున్న దేశాధ్యక్షులు సైతం టమాటా ధరలపై సమీక్షలు నిర్వహిస్తున్నారట. ప్రజలకు అందుబాటులో “సస్తా బజార్‌’ ఏర్పాటు చేసి తక్కువ ధరలకే సరుకులు, కూరగాయలు అందజేయాలని యోచిస్తున్నారట. ఇదంతా ఎక్కడో కాదు. మన పొరుగు దేశం పాకిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితి. ఇంతకీ […]

Pardhasaradhi Peri

|

Dec 06, 2019 | 7:00 PM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మండిపోతున్న ఉల్లి ధరలు..కోయ కుండానే వినియోగదారులకు కన్నీళ్లు పుట్టిస్తున్నాయి. కానీ, అక్కడ మాత్రం టమాట ఠారెత్తిస్తోంది. ఏకంగా కిలో టమాటా ధర రూ. 300లకు చేరటంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. దీంతో సీరియస్‌గా తీసుకున్న దేశాధ్యక్షులు సైతం టమాటా ధరలపై సమీక్షలు నిర్వహిస్తున్నారట. ప్రజలకు అందుబాటులో “సస్తా బజార్‌’ ఏర్పాటు చేసి తక్కువ ధరలకే సరుకులు, కూరగాయలు అందజేయాలని యోచిస్తున్నారట. ఇదంతా ఎక్కడో కాదు. మన పొరుగు దేశం పాకిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితి. ఇంతకీ అక్కడ టమాటా ధరలు ఎందుకు అంతగా మండిపోతున్నాయన్నది  పరిశీలించినట్లయితే..అందుకు కారణం భారత్‌తో పాక్‌ తెంచుకున్న మైత్రీగానే చెప్పాలంటున్నారు విశ్లేషకులు. జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ పాకిస్తాన్‌, భారత్‌తో వ్యాపార సంబంధాలను తెగతెంపులు చేసుకున్న విషయం విధితమే.. దీంతో భారత్‌ నుంచి పాకిస్తాన్‌కు ఎగుమతులు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే టమాటా ధరలు ఆకాశానికి చేరాయంటూ ఏకంగా ఆ దేశ ఆర్థిక వ్యవహారాల మంత్రి మీడియాకు వెల్లడించినట్లుగా డాన్‌ వార్తాపత్రిక కథనాన్ని ప్రచురించింది. భారత్‌తో నిలిచిపోయిన వ్యాపార లావాదేవీల కారణంగానే పాక్‌లో ఆహార ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని సదరు మంత్రి వివరించినట్లుగా డాన్‌ పత్రికలో పెర్కొంది. ప్రజలపై టమాటా భారం పడకుండా ఉండేందుకు త్వరలోనే సస్తాబజార్లు ఏర్పాటు చేయనున్నట్లుగా స్పస్టం చేశారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu