దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్ : సీపీ సజ్జనార్ ప్రెస్‌ మీట్

దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్ : సీపీ సజ్జనార్ ప్రెస్‌ మీట్

దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి వివరాలను తెల్పడానికి సైబరాబద్ సీపీ సజ్జనార్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దిశ కేసులో నిందితులు ఆరీఫ్, శివ , చెన్నకేశవులు, నవీన్‌లను అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచాం కోర్టు నిందితులను పోలీస్ కష్టడీకి ఇచ్చింది నిందితులు నారాయణ్‌ పూర్ జిల్లా మక్తల్‌కు చెందినవారు కేసును అనేక కోణాల్లో దర్యాప్తు చేశాం దిశ వాచ్, సెల్‌ఫోన్‌ను హత్య చేసిన ప్రాంతంలో దాచిపెట్టారు ఈ రోజు తెల్లవారుజూమున సీన్ రీకన్‌స్ట్రక్ […]

Ram Naramaneni

|

Dec 06, 2019 | 5:42 PM

దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి వివరాలను తెల్పడానికి సైబరాబద్ సీపీ సజ్జనార్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

దిశ కేసులో నిందితులు ఆరీఫ్, శివ , చెన్నకేశవులు, నవీన్‌లను అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచాం

కోర్టు నిందితులను పోలీస్ కష్టడీకి ఇచ్చింది

నిందితులు నారాయణ్‌ పూర్ జిల్లా మక్తల్‌కు చెందినవారు

కేసును అనేక కోణాల్లో దర్యాప్తు చేశాం

దిశ వాచ్, సెల్‌ఫోన్‌ను హత్య చేసిన ప్రాంతంలో దాచిపెట్టారు

ఈ రోజు తెల్లవారుజూమున సీన్ రీకన్‌స్ట్రక్ చేసేందుకు పోలీసులు నిందితులను స్పాట్‌కు తీసుకువచ్చారు

ఆ సమయంలో ఏ1 నిందితుడు ఆరిఫ్ పోలీసుల నుంచి గన్ లాక్కొని పారిపోయే ప్రయత్నం చేశాడు

మిగతా నిందితులు రాళ్లతో పోలీసులపై దాడి చేశారు

ఆరిఫ్ మొదట ఫైరింగ్ స్టార్ట్ చేశాడు

లొంగిపొమ్మని చెప్పినా నిందితులు వినలేదు. ఆత్మరక్షణ కోసమే పోలీసులు కాల్పులు జరిపారు

పోలీసుల తిరిగి కాల్పులు జరపడంతో నలుగురు నిందితులు చనిపోయారు

ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు సీరియస్‌గా గాయపడ్డారు

మొత్తం 10 మంది పోలీసులు ఈ ఘటన జరిగిన సమయంలో ఉన్నారు

గాయపడ్డ పోలీసులు ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్‌కుమార్ కేర్ ఆస్పత్రితో చికిత్స పొందుతున్నారు

ఉదయం 5.30 నుండి 6:15 మధ్యలో కాల్పులు జరిగాయి

ఎన్ని రౌండ్ల ఫైరింగ్ జరిగింది అనేది విచారణలో తేలుతుంది

దిశ కేసులో నిందితులు ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే తరహా నేరాలకు పాల్పడినట్లు అనుమానాలు ఉన్నాయి

అనుమానిత, గుర్తుతెలియని మరణాలపై దర్యాప్తు చేస్తున్నాం

రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఘటనపై నివేదిక పంపుతాం

దిశను సజీవ దహనం చెయ్యలేదు. చనిపోయిన తర్వాతే కాల్చేశారు

వారి కుటుంబ సభ్యులను పదే, పదే ఇబ్బందిపెట్టొద్దని మీడియాను కోరుతున్నాం

అధికారుల నుంచి సమాచారం లేకుండా, రూమర్స్ సర్కులేట్ చెయ్యెద్దు

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu