ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న ఒక్కో పోలీస్‌కి ఒక్కో లక్ష రివార్డ్..
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌కి సంబంధించి..తెలంగాణ పోలీసులకు దేశం నలుమూలల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అదే సమయంలో పోలీసులు కేంద్ర హోంశాఖకు, ఎన్‌హెచ్‌ఆర్సీకి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే మేనకా గాంధీ, కార్తీ చిదంబరం లాంటి కొంతమంది నాయకులు ఎన్‌కౌంటర్ చట్టవిరుద్దమని కామెంట్స్ చేస్తున్నారు. అయితే దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న ఒక్కో పోలీసుకు ప్రముఖ పారిశ్రామికవేత్త రూ. లక్ష రివార్డు ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. హర్యానాకు చెందిన రాహ్ గ్రూప్ అధినేత నరేశ్ సెల్పార్ ఈ సంచలన […]
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌కి సంబంధించి..తెలంగాణ పోలీసులకు దేశం నలుమూలల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అదే సమయంలో పోలీసులు కేంద్ర హోంశాఖకు, ఎన్‌హెచ్‌ఆర్సీకి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే మేనకా గాంధీ, కార్తీ చిదంబరం లాంటి కొంతమంది నాయకులు ఎన్‌కౌంటర్ చట్టవిరుద్దమని కామెంట్స్ చేస్తున్నారు.
అయితే దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న ఒక్కో పోలీసుకు ప్రముఖ పారిశ్రామికవేత్త రూ. లక్ష రివార్డు ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. హర్యానాకు చెందిన రాహ్ గ్రూప్ అధినేత నరేశ్ సెల్పార్ ఈ సంచలన ప్రకటన చేశారు. ఎంతో గొప్పగా నిందితులకు గుణపాఠం చెప్పారంటూ ఆయన తెలంగాణ కాప్స్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. మహిళలందరికి తమని తాము ప్రొటెక్ట్ చేసేలా ప్రభుత్వాలు శిక్షణా తరగతులు నిర్వహించాలని ఆయన అభ్యర్థించారు.