నేడే జగన్ నామినేషన్
పులివెందుల: నేడు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం అభ్యర్ధిగా శుక్రవారం మధ్యాహ్నం 1.49 గంటలకు జగన్ నామినేషన్ వేస్తారు. ఇందుకోసం ఉదయం పది గంటలకే ఆయన హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో పులివెందులకు చేరుకుంటారు. నామినేషన్‌కు ముందు జరగనున్న బహిరంగసభలో జగన్ మాట్లాడతారు. అయితే నామినేషన్ అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని వైసీపీ నాయకుడు అవినాశ్ రెడ్డి తెలిపారు. పులివెందుల సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన […]
పులివెందుల: నేడు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం అభ్యర్ధిగా శుక్రవారం మధ్యాహ్నం 1.49 గంటలకు జగన్ నామినేషన్ వేస్తారు. ఇందుకోసం ఉదయం పది గంటలకే ఆయన హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో పులివెందులకు చేరుకుంటారు. నామినేషన్‌కు ముందు జరగనున్న బహిరంగసభలో జగన్ మాట్లాడతారు. అయితే నామినేషన్ అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని వైసీపీ నాయకుడు అవినాశ్ రెడ్డి తెలిపారు. పులివెందుల సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన జగన్ ఈసారి కూడా అదే నియోజకవర్గం నుంచి నామినేషన్ వేస్తున్నారు.