‘ విజయం మాదే ! ‘ ఆసుపత్రిలోనే ట్వీట్ చేసిన సంజయ్

  అస్వస్థతకు గురైన శివసేన నేత సంజయ్ రౌత్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న రాత్రి ఆయనకు డాక్టర్లు ఏంజియో ప్లాస్టీ నిర్వహించారు. తమ రాష్ట్రంలోని తాజా పరిణామాల గురించి తెలుసుకున్న సంజయ్.. ప్రముఖ హిందీ కవి సోహన్ లాల్ ద్వివేదీ రాసిన ఓ కవితను ట్వీట్ చేశారు. ‘ మిమ్మల్ని భయమనే తరంగాలు వెన్నాడితే సముద్రాన్ని దాటలేరు. అయితే ప్రయత్నించే వారు ఓడిపోరు ‘ అన్నదే ఆ కవిత సారాంశం. ఈ నేపథ్యంలో […]

' విజయం మాదే ! ' ఆసుపత్రిలోనే ట్వీట్ చేసిన సంజయ్

 

అస్వస్థతకు గురైన శివసేన నేత సంజయ్ రౌత్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న రాత్రి ఆయనకు డాక్టర్లు ఏంజియో ప్లాస్టీ నిర్వహించారు. తమ రాష్ట్రంలోని తాజా పరిణామాల గురించి తెలుసుకున్న సంజయ్.. ప్రముఖ హిందీ కవి సోహన్ లాల్ ద్వివేదీ రాసిన ఓ కవితను ట్వీట్ చేశారు. ‘ మిమ్మల్ని భయమనే తరంగాలు వెన్నాడితే సముద్రాన్ని దాటలేరు. అయితే ప్రయత్నించే వారు ఓడిపోరు ‘ అన్నదే ఆ కవిత సారాంశం. ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్.. తామే తప్పనిసరిగా సక్సెస్ అవుతామని పేర్కొన్నారు. (మహారాష్ట్రలో శివసేన ఆధ్వర్యంలోనే ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆయన ఈ రకంగా అభిప్రాయపడ్డారు). ఇక ఇవాళ ఆసుపత్రిలో ఆయనను సేన చీఫ్ ఉధ్ధవ్ థాక్రే, ఎన్సీపీ నేత శరద్ పవార్, సుప్రియా సోలె, బీజేపీ నేతలు హర్షవర్ధన్ పాటిల్, ఆశిష్ షెలార్ తదితరులు పరామర్శించారు. కాగా-తన సోదరుడిని ఆరోగ్యం నిలకడగా ఉందని సంజయ్ బ్రదర్ సునీల్ రౌత్ తెలిపారు.