GHMC Elections Results 2020 : గ్రేటర్‌ పీఠం దక్కేదెవరికి… ఈసారి మేయర్‌ ఆమేనా? పోటీలో ఉన్నది ఎవరో..

గ్రేటర్‌ ఎన్నికల్లో ఫలితాల లెక్కింపు కొనసాగుతుంది. మేయర్‌ పీఠం కైవసం దిశగా అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఈసారి మేయర్‌ పీఠం దక్కే ఆ లక్కీఫెలో ఎవరనే ఊహగానాలు ఊపందుకున్నాయి.

GHMC Elections Results 2020 : గ్రేటర్‌ పీఠం దక్కేదెవరికి... ఈసారి మేయర్‌ ఆమేనా? పోటీలో ఉన్నది ఎవరో..
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 05, 2020 | 5:25 AM

Ghmc Mayor Candidates : గ్రేటర్‌ ఎన్నికల్లో ఫలితాల లెక్కింపు కొనసాగుతుంది. మేయర్‌ పీఠం కైవసం దిశగా అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఈసారి మేయర్‌ పీఠం దక్కే ఆ లక్కీఫెలో ఎవరనే ఊహగానాలు ఊపందుకున్నాయి. ఈసారి మేయర్‌ సీటును జనరల్ మహిళకు రిజర్వ్‌ అయింది. ఈ నేపథ్యంలో మేయర్‌పీఠంపై కూర్చునే ఆ మహిళామణి ఎవరు అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా బొంతు శ్రీదేవి, పీజేఆర్‌ కుమార్తె విజయారెడ్డిలు మేయర్‌ పదవిపై ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తుంది.

మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సతీమణి బొంతు శ్రీదేవి చర్లపల్లి డివిజన్‌ నుంచి గెలుపొందారు. ఇక విజయారెడ్డి ఖైరతాబాద్‌ డివిజన్‌ నుంచి విజయం సాధించారు. మేయర్‌ పదవి జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కావడంతో ఈ ఇద్దరు కూడా ఆ పదవిపై కన్నేశారు. అయితే అనూహ్యంగా భారతి నగర్ డివిజన్ నుంచి విజయం సాధించిన సింధు ఆదర్శ్ రెడ్డి కి సీఎం కేసీఆర్‌ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తుంది. మేయర్‌ పదవిని కట్టబెట్టేందుకే సింధును సీఎం పిలిచారనే చర్చ జోరందుకుంది.