ఐపీఎల్ స్వరూపం మారనుందా… పది జట్లు… రెండు గ్రూపులు.. 14 లీగ్ మ్యాచులు…
భారత్‌లో క్రికెట్ ను మరో లెవల్‌కి తీసుకెళ్లింది ఐపీఎల్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. త్వరలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ సరికొత్త ఫార్మాట్లోకి మారబోతోందని సమాచారం.
భారత్‌లో క్రికెట్ ను మరో లెవల్‌కి తీసుకెళ్లింది ఐపీఎల్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. త్వరలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ సరికొత్త ఫార్మాట్లోకి మారబోతోందని సమాచారం. పది జట్లను రెండు గ్రూపులుగా విభజించి… లీగ్ మ్యాచులు నిర్వహించనున్నారు. టోర్నీ ని త్వరగా ముగించేందుకే బీసీసీఐ లీగ్ స్వరూపాన్ని మార్చనుంది.
కొత్తగా రెండు ఫ్రాంచైజీలు…
ప్రస్తుతం ఐపీఎల్ లో 8 జట్లు ఉన్నాయి. రానున్న బీసీసీఐ వార్షిక సమావేశంలో మరో రెండు ఫ్రాంచైజీలు రానున్నట్లు తెలుస్తోంది. అదానీ, గోయెంకా సంస్థలు క్రికెట్ జట్టును కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. కాగా, గతంలో 2011 లోనూ లీగులో 10 జట్లు తలపడ్డాయి. వచ్చే సీజన్లో పది జట్లు ఉంటాయి.
ఆట సేమ్ టు సేమ్….
గతంలో మాదిరే లీగ్ దశలో ప్రతీ జట్టు 14 మ్యాచ్ లు ఆడనున్నాయి. ఒక్కో టీం మరో టీంతో రెండు సార్లు తలపడనుంది. ఎక్కువ పాయింట్లు వచ్చిన నాలుగు జట్లు ప్లే ఆఫ్ కు అర్హత సాధిస్తాయి. తర్వాత ప్రతీ ఏడాదిలాగానే ఐపీఎల్ క్వార్టర్, సెమీ, ఫైనల్స్ జరుగుతాయి.