Saving Electricity: ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే విద్యుత్ ఆదాతో పాటు.. ఎలక్ర్టికల్ వస్తువులు సేఫ్

Saving Electricity: రోజు రోజుకీ పెరుగుతున్న ఎలక్రికల్ వస్తువుల వినియోగంతో నెలాఖారురికి విద్యుత్ బిల్లు కూడా భారీగానే వస్తుంది. అయితే కొన్ని సార్లు మనం తెలిసి కూడా నిర్లక్ష్యంతో..

Saving Electricity: ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే విద్యుత్ ఆదాతో పాటు..  ఎలక్ర్టికల్ వస్తువులు సేఫ్
Energy At Home
Follow us
Surya Kala

|

Updated on: Jul 31, 2021 | 10:47 AM

Saving Electricity: రోజు రోజుకీ పెరుగుతున్న ఎలక్రికల్ వస్తువుల వినియోగంతో నెలాఖారురికి విద్యుత్ బిల్లు కూడా భారీగానే వస్తుంది. అయితే కొన్ని సార్లు మనం తెలిసి కూడా నిర్లక్ష్యంతో ఏమి జరుగుతుందిలే అని భావిస్తూ చేసే పనుల వలన కూడా విద్యుత్ బిల్లులు భారీగా వడ్డించే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా మనం లాప్ టాప్, సెల్ ఛార్జర్, వాషింగ్ మెషీన్స్, టీవీలు వంటివాటిని ఉపయోగించి మనకు తెలియకుండా చేసే చిన్న పొరపాట్లతో మొత్తం విద్యుత్ బిల్లుల్లో మినిమమ్ 1 శాతం పెరుగుతుందని తెలుస్తోంది.

ఎక్కువ మంది టీవీ చుసిన అనంతరం రిమోట్ తో ఆఫ్ చేసి.. స్విచ్ ఆఫ్ చేయకుండా ఇతరపనులను చూసుకుంటారు. అయితే ఇలా స్విచ్ ఆఫ్ చేయకపోవడంతో టివి.. రోజుకు 24 వాట్ల పవర్‌ను తీసుకుంటుంది.. రోజు తక్కువే అనిపించినా.. ఆలా రోజుల తరబడి లెక్కిస్తే ఎక్కువే కదా..ప్రస్తుతం సెల్ ఫోన్ల ఛార్జింగ్ విషయంలో ఎక్కువమంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫోన్ ఛార్జింగ్ పెట్టిన తర్వాతనో లేదా మధ్యలో ఫోన్ కాల్ వస్తేనే.. ఛార్జర్ పిన్ నుంచి ఫోన్ తీసి మాట్లాడుతూ .. స్విచ్ ఆఫ్ చేయడం మరచిపోతారు. కొంతమంది స్విచ్ ఆఫ్ చేసినా సాకెట్ నుంచి ఛార్జర్ ను తీయరు.. దీంతో ఆ ఛార్జర్ సగటున రోజుకు 1.3 వాట్ల పవర్‌ను తీసుకుంటుంది. అంతేకాదు.. అలా సాకెట్ కు ఛార్జర్ ఉంచితే.. పాడైపోయే అవకాశమే కాదు.. ఒకొక్కసారి పేలిపోయే అవకాశం కూడా ఉంది. కనుక ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత సాకెట్ నుంచి ఛార్జర్ ను తీసివేయడం మంచిది.

ఇక ఇంటర్నెట్ ను ఉపయోగించిన అనంతరం వైఫై మోడెమ్ స్విచ్ ఆఫ్ చేయాలి. ఇక మైక్రో ఓవెన్స్ తక్కువమంది ఇంట్లో ఉన్నా.. చాలా మంది వీటిని ఉపయోగించిన అనంతరం స్విచ్ ఆఫ్ చేసి.. అం ప్లగ్ చేయకుండా వదిలేస్తారు.. అయితే మైక్రో ఓవెన్స్‌, ఓవెన్స్‌లు ఒకరోజులో 108 వాట్ల పవర్‌ను తీసుకుంటాయి కనుక అన్ ప్లగ్ చేయడం మంచిది. అంతేకాదు మనం రెగ్యులర్ గా ఉపయోగించే ఎలక్రికల్ వస్తువులైన డ్రైయర్స్‌, మిక్సర్‌లు, గ్రైండర్‌లు, రైస్‌ కుక్కర్లు, టేబుల్‌ ఫ్యాన్‌లు, బ్లూటూత్‌ స్పీకర్‌లు ఆఫ్‌ చేయడం ముఖ్యంగా అన్‌ఫ్లగ్‌ చేయడం మంచిది. అంతేకాదు ల్యాప్‌టాప్‌లను సిచ్ఛాఫ్‌ చేసి అన్‌ఫ్లగ్‌ చేయడం తో విద్యుత్ బిల్లు ఆదా అవ్వడమే కాదు.. ఎలక్ర్టికల్ వస్తువులు త్వరగా పాడైపోకుండా ఉంటాయి.

Also Read: Venu Aravind: టీవీ సీనియర్ యాక్టర్ వేణు అరవింద్ ఆరోగ్య పరిస్థితి విషమం అంటూ వార్తలు.. స్పందించిన రాధిక