AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: రాత్రుళ్లు కడుపులో నొప్పిగా ఉంటుందా.? కారణం ఇదే కావొచ్చు..

కడుపు నొప్పి.. మనలో చాలా మంది ఎదుర్కొనే సాధారణ ఆరోగ్య సమస్య. అయితే కొన్ని సందర్భాల్లో కడుపునొప్పి సాధారణంగానే మరికొన్ని సందర్భాల్లో తీవ్ర ఇబ్బందికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా రాత్రుళ్లు కడుపు నొప్పి రావడానికి పలు రకాల కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ రాత్రుళ్లు కడుపు నొప్పి రావడానికి ప్రధానంగా...

Lifestyle: రాత్రుళ్లు కడుపులో నొప్పిగా ఉంటుందా.? కారణం ఇదే కావొచ్చు..
Stomach Pain
Narender Vaitla
|

Updated on: Apr 11, 2024 | 8:46 PM

Share

కడుపు నొప్పి.. మనలో చాలా మంది ఎదుర్కొనే సాధారణ ఆరోగ్య సమస్య. అయితే కొన్ని సందర్భాల్లో కడుపునొప్పి సాధారణంగానే మరికొన్ని సందర్భాల్లో తీవ్ర ఇబ్బందికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా రాత్రుళ్లు కడుపు నొప్పి రావడానికి పలు రకాల కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ రాత్రుళ్లు కడుపు నొప్పి రావడానికి ప్రధానంగా 6 కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* రాత్రి పడుకున్న తర్వాత కడుపు నొప్పి రావడానికి ప్రధాన కారణాల్లో గ్యాస్‌ సమస్య ఒకటి. దీనివల్ల కడుపు నొప్పి వేధిస్తుటుంది. దీనికి కారణం తీసుకునే ఆహారంలో లోపాలు ఉండడమే. రాత్రి పూట త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోకపోతే ఇలాంటి సమస్యలు వస్తాయి.

* రాత్రిపూట కడుపు నొప్పి యాసిడ్ రిఫ్లక్స్ లేదా గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వల్ల కూడా సంభవించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట సరిగా తినకపోవడం వంటి కారణాల ద్వారా ఈ సమస్య వస్తుంది.

* ఇందులో ఆహారం కడుపు పైప్ వైపు తిరిగి రావడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా ఆహార పైపులో చికాకు లేదా ఇతర సమస్యలు ఉండవచ్చు.

* పిత్తాశయంలో రాళ్లు ఏర్పడడం వల్ల కూడా కడుపు నొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. రాళ్లు పిత్తాశయాన్ని అడ్డుకోవడం వల్ల నొప్పి వస్తుంది. రాత్రిపూట కడుపు నొప్పి రెండు రోజుల కంటే ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి, సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.

* పెప్టిక్‌ అల్సర్‌ వల్ల కూడా కడుపులో నొప్పి వస్తుంది. కడుపులో పుండును పెప్టిక్ అల్సర్‌గా పిలుస్తారు. కడుపులో అధిక మొత్తంలో యాసిడ్ కడుపు నొప్పికి కారణమవుతుంది. దీనికి వెంటనే చికిత్స చేయాల్సి ఉంటుంది.

* ఇరిటెబుల్ బౌల్ సిండ్రోమ్ (ఐబీఎస్) వల్ల కూడా రాత్రి కడుపులో నొప్పికి కారణమవుతుంది. కడుపు నొప్పితో పాటు, గ్యాస్, డయేరియా, మలబద్ధకం వంటి లక్షణాలు ఇందులో కనిపిస్తాయి.

* డైవర్టికులిటిస్ సమస్య వళ్ల కూడా రాత్రుళ్లు కడుపులో నొప్పి వేధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య ముఖ్యంగా 40 ఏళ్లు నిండిన వారిలో కనిపిస్తుంది. దీని కారణంగా, కడుపులోని ఒక భాగంలో వాపు ప్రారంభమవుతుంది. ఈ సమస్య ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..