AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheating Partner: మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేస్తున్నాడని అనుమానమా.. తెలుసుకునేందుకు ఈ ట్రిక్స్ మీ కోసం

మీ జీవిత భాగస్వామి వైఖరి మారుతుంటే ముందుగానే గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చట. మీ పట్ల భాగస్వామి వైఖరి ఎందుకు మారిపోయింది? అతను మీపై ఎందుకు శ్రద్ధ చూపడం లేదు? ఎప్పుడూ మిమ్మల్ని అతుక్కుపోయి ఉండే మనిషి ఎందుకు దూరంగా ఉంటున్నాడు అని ఆలోచించాలట. అప్పుడు మీ జీవిత భాగస్వామి ఆకర్షణ తగ్గి.. అతని జీవితంలో మరొకరి పట్ల ఆకర్షణ కలిగి ఉండవచ్చట. కనుక మీ భాగస్వామి మరొకరి పట్ల ఆకర్షితులై ఉండవచ్చు. అతను మిమ్మల్ని మోసం చేస్తున్నాడా?  మీ భాగస్వామి మోసం చేస్తున్నారో లేదో తెలుసుకోవడం ఎలా..

Cheating Partner: మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేస్తున్నాడని అనుమానమా.. తెలుసుకునేందుకు ఈ ట్రిక్స్ మీ కోసం
Cheating Partner
Surya Kala
|

Updated on: Apr 12, 2024 | 9:41 AM

Share

భార్యాభర్తల మధ్య బంధం నేటి పరిస్థితుల్లో బీటలు వారుతున్నాయి. మరీ ముఖ్యంగా గత కొంత కాలం నుంచి ఒకరినొకరు మోసం చేసుకుంటూ వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్న సంఘటలకు సంబంధించిన వార్తలు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే మీ జీవిత భాగస్వామి వైఖరి మారుతుంటే ముందుగానే గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చట. మీ పట్ల భాగస్వామి వైఖరి ఎందుకు మారిపోయింది? అతను మీపై ఎందుకు శ్రద్ధ చూపడం లేదు? ఎప్పుడూ మిమ్మల్ని అతుక్కుపోయి ఉండే మనిషి ఎందుకు దూరంగా ఉంటున్నాడు అని ఆలోచించాలట. అప్పుడు మీ జీవిత భాగస్వామి ఆకర్షణ తగ్గి.. అతని జీవితంలో మరొకరి పట్ల ఆకర్షణ కలిగి ఉండవచ్చట. కనుక మీ భాగస్వామి మరొకరి పట్ల ఆకర్షితులై ఉండవచ్చు. అతను మిమ్మల్ని మోసం చేస్తున్నాడా?  మీ భాగస్వామి మోసం చేస్తున్నారో లేదో తెలుసుకోవడం ఎలా…

  1. భాగస్వామి మీ నుండి దూరాన్ని క్రమ క్రమంగా పెంచుతూ ఉంటే.. అతను విడిపోయిన అనుభూతిని మీకు ఆకలిగిస్తుంటే మీ భాగస్వామి గురించి ఆలోచించాలట. అంతేకాదు మీరు ఏమి చేసినా.. మీ ప్రవర్తనని తప్పు పడుతూ చిరాకు పడుతూ ఉన్నా అతని ప్రవర్తన గురించి ఆలోచించాల్సిందే.. ,
  2.  అతను మీ నుంచి ప్రతి విషయం దాచాలని ఆలోచిస్తూ ఉంటారు. చిన్న పెద్ద విషయాలను కూడా మీ నుంచి దాచడం ప్రారంభిస్తారు. రోజూ రాత్రి 7 గంటలకు ఇంటికి తిరిగి వచ్చే వ్యక్తి రాత్రి 10 గంటలైనా ఇంటికి రావడానికి ఇష్టపడరు.. సరి కదా ఏమిటి ఇది అంటే గొడవ పెట్టుకోవడానికి రెడీగా ఉంటారు.
  3. ఫోన్ లో మాట్లాడుతుంటే మీరు హఠాత్తుగా కనిపిస్తే కాల్ ని కట్ చేయడం లేదా మాట్లాడం మానేయడం వంటివి చేస్తాడు.
  4. చిన్న చిన్న విషయాలకు కూడా అబద్ధం చెప్పే ధోరణి పెరుగుతుంది. తరచుగా మీతో గడిపే సమయం కూడ తగ్గిపోతుంది. అర్ధరాత్రి కూడా ఫోన్‌ని చూడటం ప్రారంభిస్తాడు.
  5. హఠాత్తుగా వాడుతున్న సెల్ ఫోన్ కు లాక్, ఫోన్ పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసుకోవడం.. లేదా అంతకు ముందు ఉన్న ఫోన్ పాస్‌వర్డ్ లేదా ఫోన్ లాక్ ప్యాటర్న్ అకస్మాత్తుగా మారిస్తే తప్పనిసరిగా మీ భాగస్వామి ప్రవర్తన గురించి ఆలోచించాల్సిందే.
  6. ఇవన్నీ భాగస్వామి మీ నుంచి దూరం జరగడానికి, మీ నుంచి  తన వివాహేతర సంబంధాన్ని దాచడానికి ప్రారంభ సంకేతాలుగా భావించాలట. మరి అలాంటి సందర్భంలో మీ జీవిత భాగస్వామి పట్ల మీ వ్యూహాలు మార్చుకోవాలి. మీ బంధాన్ని మళ్ళీ ఆరోగ్యకరమైన బాట పట్టేలా చూసుకోవాలి.

(పైన పేర్కొన్న అంశాలను నిపుణుల అభిప్రాయాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి