AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips: ఈ నెల 16న ఏర్పడనున్న రెండు శుభయోగాలు.. ఈ మూడు రాశుల వారికి డబ్బే డబ్బు..

ఈ నెల 16వ తేదీన అష్టమి తిధి రానున్నది. ఈ రోజున రెండు శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఒకటి రవి యోగం కాగా మరొకటి సర్వార్థసిద్ధి యోగం. ఈ రెండు యోగాల కారణంగా కొన్ని రాశులవారు అదృష్టం అందుకోనున్నారు. ఈ రోజు ఆ లక్కీ రాశులు ఏమిటో తెలుసుకుందాం.. కన్యారాశి: ఈ నెల 16న ఏర్పడనున్న రెండు శుభయోగాలు కన్య రాశి వారికి ఊహించని అదృష్టాన్ని ఇవ్వబోతున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. స

Astro Tips: ఈ నెల 16న ఏర్పడనున్న రెండు శుభయోగాలు.. ఈ మూడు రాశుల వారికి డబ్బే డబ్బు..
Astrology
Surya Kala
|

Updated on: Apr 12, 2024 | 7:05 AM

Share

తెలుగువారి మొదటి నెల చైత్ర మాసంలో అడుగు పెట్టాం.. శ్రీ నవమి వేడుకలకు తెలుగు ప్రజలతో పాటు యావత్ భారత దేశం రెడీ అవుతున్నారు. ఈ నెల 16వ తేదీన అష్టమి తిధి రానున్నది. ఈ రోజున రెండు శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఒకటి రవి యోగం కాగా మరొకటి సర్వార్థసిద్ధి యోగం. ఈ రెండు యోగాల కారణంగా కొన్ని రాశులవారు అదృష్టం అందుకోనున్నారు. ఈ రోజు ఆ లక్కీ రాశులు ఏమిటో తెలుసుకుందాం..

కన్యారాశి: ఈ నెల 16న ఏర్పడనున్న రెండు శుభయోగాలు కన్య రాశి వారికి ఊహించని అదృష్టాన్ని ఇవ్వబోతున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలను అందుకుంటారు. ప్రత్యర్థులపై పైచేయి సాధించి కెరీర్ లో ముందుకు వెళ్లారు. ఏ పని చేపట్టినా అందులో విజయాన్ని అందుకుంటారు. తక్కువ సమయంలోనే ఆర్ధికంగా అభివృద్ధి బాట పడతారు.

వృషభ రాశి : ఈ రెండు శుభ యోగాలు ఈ చెందిన వ్యక్తులపై అపరా అదృష్టాన్ని కలిగిస్తాయి. పలు విధాలుగా డబ్బులను అందుకుంటారు. పూర్వీకుల ఆస్తులు కలిసి వస్తాయి. ఆగిన పనులు తిరిగి ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక పర్యటన చేస్తారు. జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు శుభ వినే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

కర్కాటక రాశి : ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఈ రెండు శుభ యోగాలతో పట్టిందల్లా బంగారంగా మారుతుంది. కెరీర్ లో శుభవార్త వింటారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారు శుభవార్త వింటారు. ఆర్ధికంగా లాభాలను అందుకుంటారు. ఆర్ధికంగా అభివృద్ధి చెందుతారు. ఆత్మీయులను కలిసి సంతోషముగా గడుపుతారు. అప్పులను తీర్చి రుణ విముక్తులవుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు