AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shubha Yogas: మేష రాశిలోకి రవి గ్రహం ప్రవేశం.. ఆ రాశుల వారికి శుభ వార్తలు, శుభ యోగాలు..!

ఈ నెల 14న రవి గ్రహం మేష రాశి ప్రవేశంతో కొన్ని రాశుల వారి జీవితాలు మారిపోబోతున్నాయి. ఇందుకు మేష రాశిలో రవి ఉచ్ఛపడుతుండడం ఒక కారణం కాగా, అక్కడ గురువుతో కలవడం మరో విశేషం. గురు, రవులు కలవడం వల్ల ఎక్కువగా శుభవార్తలు వినడం జరుగు తుంది. గురు, రవులు కలవడం వల్ల పదోన్నతులు లభిస్తాయి. అన్ని విధాలు గానూ హోదా పెరుగుతుంది.

Shubha Yogas: మేష రాశిలోకి రవి గ్రహం ప్రవేశం.. ఆ రాశుల వారికి శుభ వార్తలు, శుభ యోగాలు..!
Shubha Yogas
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Apr 11, 2024 | 7:50 PM

Share

ఈ నెల 14న రవి గ్రహం మేష రాశి ప్రవేశంతో కొన్ని రాశుల వారి జీవితాలు మారిపోబోతున్నాయి. ఇందుకు మేష రాశిలో రవి ఉచ్ఛపడుతుండడం ఒక కారణం కాగా, అక్కడ గురువుతో కలవడం మరో విశేషం. గురు, రవులు కలవడం వల్ల ఎక్కువగా శుభవార్తలు వినడం జరుగు తుంది. గురు, రవులు కలవడం వల్ల పదోన్నతులు లభిస్తాయి. అన్ని విధాలు గానూ హోదా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోవడమే కాకుండా, జీవన శైలి కూడా మారిపోతుంది. మేషం, మిథునం, కర్కాటకం, సింహం, తుల, ధనుస్సు రాశుల వారికి జీవితం నిత్య కల్యాణం పచ్చతోరణంలా సాగిపోతుంది. ఈ నెలాఖరు వరకు ఈ యోగబలం కొనసాగుతుంది.

  1. మేషం: ఈ రాశిలో గురు, రవులు యుతి చెందడం వల్ల ఉద్యోగంలో ఈ రాశివారి ప్రాభవం బాగా పెరుగు తుంది. ఒక సంస్థకు అధిపతి కాగల యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా విదేశా లకు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అధికార, ఆదాయ సంబంధమైన ఒప్పందాలు కుదర్చు కోవడం జరుగుతుంది. ఏ రంగానికి చెందినవారైనా పురోగతి చెందే అవకాశం ఉంది కానీ, రాజకీయ వర్గాల వారికి, రియల్ ఎస్టేట్ వారికి ఇది మరింత యోగ కాలమని చెప్పవచ్చు.
  2. మిథునం: లాభస్థానంలో రవి, గురువులు కలిసే పక్షంలో వీరి ప్రాభవానికి, వైభవానికి తిరుగుండదు. జాత కంలో ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో మంచి గుర్తింపు లభించడంతో పాటు ఊహించని స్థాయిలో లాభాలు అందుకుంటారు. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడ తాయి. ఆస్తి సమస్యలు తప్పకుండా పరిష్కారమవుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశ ముంది. ఆర్థికపరంగా అనేక లాభాలు చేకూరుతాయి. ఉద్యోగంలో హోదా, జీతభత్యాలు పెరుగుతాయి.
  3. కర్కాటకం: ఈ రాశికి ఉద్యోగ స్థానంలో గురు, రవులు కలవడం వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగు తుంది. పదోన్నతికి అవకాశముంది. పేరు ప్రఖ్యాతులు విస్తరిస్తాయి. ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఊహించని విధంగా ఆఫర్లు అందుతాయి. మరింత మంచి ఉద్యోగం లోకి మారడానికి అవకాశం ఉంది. తల్లితండ్రుల నుంచి ఆస్తి లేదా సంపద కలిసి వస్తుంది. విదేశీ యానానికి, విదేశాల్లో ఉద్యోగాలకు ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది.
  4. సింహం: ఈ రాశ్యధిపతి రవి తన మిత్రుడైన గురువుతో భాగ్య స్థానంలో కలవడం వల్ల జీవన శైలే మారి పోయే అవకాశముంది. సమాజంలో ఒక ప్రముఖుడుగా చెలామణీ కావడం జరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. విదేశాల నుంచి ఆఫర్లు అందు తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగానే కాకుండా వ్యక్తిగత, కుటుంబపరంగా శుభ వార్తలు వినడం జరుగుతుంది. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది.
  5. తుల: ఈ రాశికి సప్తమంలో గురు, రవుల కలయిక వల్ల అనూహ్యంగా సిరిసంపదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. రాజకీయాలు, పాలనా రంగం, ప్రభుత్వంలో ఉన్నవారికి హోదాలు పెరగడంతో పాటు ఆర్థికంగా అంచనాలకు మించి కలిసి వస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచే కాక, దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా విముక్తి లభి స్తుంది. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీవిత భాగస్వామికి కూడా అదృష్టం పడుతుంది.
  6. ధనుస్సు: ఈ రాశ్యధిపతి గురువు, రవి పంచమ స్థానంలో కలుసుకోవడం వల్ల వృత్తి, ఉద్యోగాలపరంగానే కాక, సామాజికంగా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. సర్వత్రా గౌరవాదరణలు పెరుగు తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఎక్కువగా శుభవార్తలు వినడం జరుగుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.