AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Skin Care: ఎండ వేడికి మీ చర్మం మెరుపు కోల్పోతుందా.. తినే ఆహారంలో ఈ 4 రకాల డ్రింక్స్ చేర్చుకోండి..

వేసవి కాలంలో శరీరం, చర్మం రెండింటినీ హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యమని అందరికీ తెలుసు. ఈ సీజన్‌లో వేడి గాలులు, సూర్యకాంతి చర్మ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో, తినే ఆహారంలో హైడ్రేషన్‌ను కొనసాగించే పానీయాలను తప్పనిసరిగా చేర్చుకోవాలని డైటీషియన్ మోహిని డోంగ్రే చెప్పారు. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు చర్మానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కనుక ఈ రోజు వేసవిలో స్కిన్ కు మెరుపునిచ్చే పానీయాల గురించి తెలుసుకుందాం

Summer Skin Care: ఎండ వేడికి మీ చర్మం మెరుపు కోల్పోతుందా.. తినే ఆహారంలో ఈ 4 రకాల డ్రింక్స్ చేర్చుకోండి..
Summer Skin Care Tips
Surya Kala
|

Updated on: Apr 12, 2024 | 9:14 AM

Share

వేసవిలో మండే ఎండల వల్ల ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా అనేక సమస్యలు వస్తాయి.  సూర్యరశ్మి వేడి, ఉష్ణోగ్రతలు ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఎండ వేదికతో చర్మానికి జరిగే నష్టాన్నివిస్మరించ కూడదు. అంతేకాదు డీహైడ్రేషన్ బారిన పడకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వేసవిలో చర్మం గురించి మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వేసవి కాలంలో శరీరం, చర్మం రెండింటినీ హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యమని అందరికీ తెలుసు. ఈ సీజన్‌లో వేడి గాలులు, సూర్యకాంతి చర్మ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో, తినే ఆహారంలో హైడ్రేషన్‌ను కొనసాగించే పానీయాలను తప్పనిసరిగా చేర్చుకోవాలని డైటీషియన్ మోహిని డోంగ్రే చెప్పారు. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు చర్మానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కనుక ఈ రోజు వేసవిలో స్కిన్ కు మెరుపునిచ్చే పానీయాల గురించి తెలుసుకుందాం..

నిమ్మరసం: వేసవిలో ఎక్కువ మంది ఇష్టంగా తాగే పానీయం నిమ్మరసం. విటమిన్ సి పుష్కలంగా ఉన్న నిమ్మకాయ ఆరోగ్యానికి దివ్యౌషధంగా పరిగణించబడుతుంది. ఇది ఆరోగ్యానికి మరియు చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. నిమ్మలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో సహాయపడతాయి. అంతేకాదు నిమ్మరసం ముఖం మీద ముడతలు, వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదించేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మజ్జిగ: పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం వేసవిలో చాలా మందికి మజ్జిగ కూడా ఇష్టమైన పానీయం. లాక్టిక్ ఆమ్లం ఇందులో కనిపిస్తుంది. ఇది సహజంగా ప్రోబయోటిక్. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మజ్జిగ తాగడం వల్ల చర్మం తేమగా ఉండడమే కాదు మెరిపునిస్తుంది. వేసవి కాలంలో తినే ఆహారంలో మజ్జిగను తప్పకుండా చేర్చుకోండి.

సత్తు షర్బత్: ఈ సీజన్‌లో సత్తు షర్బత్ కూడా చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. సత్తు షర్బత్ తాగడం వల్ల జీర్ణశక్తి గణనీయంగా మెరుగుపడుతుంది. అంతేకాదు అనేక ఆరోగ్య సమస్యల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. దీన్ని తాగడం వల్ల ఎనర్జిటిక్‌గా ఉండడమే కాదు చర్మంలో నేచురల్ గ్లో వచ్చేలా చేస్తుంది.

ఆమ్ పన్నా (మామిడి పన్నా) : మామిడి కాయతో చేసే ఈ తీపి, పుల్లని పానీయాన్ని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. ఇది చర్మానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూర్చడంలో కూడా సహాయపడుతుంది. దీన్ని తాగడం వల్ల త్వరగా రీహైడ్రేట్ అవుతారు. మామిడి పన్నాలో విటమిన్ ఎ, సి, ఐరన్, ఫోలేట్స్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి చర్మానికి మెరుపుని ఇస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..