Ghost Fleet : ఆ నౌకాశ్రయాన్ని చూస్తే భయంతో వణికిపోవడం ఖాయం!
ఆత్మలు.. దయ్యాలు వట్టి ట్రాష్ అంటారు కొందరు.. చాలామందికి మాత్రం ఆత్మలున్నాయనే గట్టి నమ్మకం.. ఆత్మలున్నాయి కాబట్టి దయ్యాలు కూడా ఉండే ఉంటాయన్నది వారి వాదన..

ఆత్మలు.. దయ్యాలు వట్టి ట్రాష్ అంటారు కొందరు.. చాలామందికి మాత్రం ఆత్మలున్నాయనే గట్టి నమ్మకం.. ఆత్మలున్నాయి కాబట్టి దయ్యాలు కూడా ఉండే ఉంటాయన్నది వారి వాదన.. అవి ఉన్నాయో లేవో …చూశారో…చూల్లేదో కానీ.. దయ్యారు మాత్రం ప్రపంచవ్యాప్తంగా పాపులరయ్యాయి. అసలు దయ్యం అన్న సౌండ్‌లో ఓ రకమైన వైబ్రేషన్ ఉంటుంది.. అందుకే దయ్యం అనగానే ఏదో తెలియని భయం ఆవహిస్తుంటుంది. దయ్యం పేరుతో ఓ అందమైన ఉద్యానవనం ఉందనుకుందాం! అందులో అడుగుపెట్టడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం..! అదీ దయ్యం పవర్! ఇట్లాంటిదే దయ్యాల నౌకల గుంపు..! అక్కడ దయ్యాలు లేవు .. భూతాలు లేవుగానీ.. ఆ నౌకాశ్రయానికి ఆ పేరొచ్చేసింది…టూరిస్టు సెంటర్‌గా మారిపోయింది.
నదిలో బోలెడన్ని నౌకలు. ఎక్కడికి కదలవు. లంగరేసినట్టుగా ఓ చోట నిలుచుని ఉంటాయి. కొన్నేళ్ల నుంచి అలాగే ఉన్నాయి. నౌకాశ్రయంలా ఉంటుంది కానీ నౌకాశ్రయం కాదు. అందుకే కొన్ని నౌకలు జలచరాలకు ఆవాసమయ్యాయి. కొన్ని ఓడలపై చెట్లు చేమలు మొలిచాయి. కొన్నేమో శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇలా పెక్యూలియర్‌గా ఉండట వల్లమో ఇప్పుడది టూరిస్టు ప్లేసుగా మారింది. రోజుకు కొన్ని వేల మంది కళ్లింత చేసుకుని ఆ వింత పోర్టును చూసి వెళుతున్నారు. ఇప్పుడు కాదు లేండి. కరోనా లేని రోజుల్లో.

Ghost Fleet (3)
ఎక్కడా కనిపించని ఇలాంటి నౌకాశ్రయాన్ని చూడాలంటే అమెరికాకు వెళ్లాలి… అక్కడ మేరీల్యాండ్‌లో పొటొమాక్ అనే నది ఉంది. ఆ నదిలో ఉందీ ఘోస్ట్ ఫ్లీట్. ఘోస్ట్ అంటున్నానని కంగారు పడకండి.. అలా ఓ మూల పాడుపడినట్టుగా ఉన్నాయి కాబట్టే దయ్యాల నౌకల గుంపు అనే పేరొచ్చింది. అంతే తప్ప ఇక్కడ దయ్యాలు భూతాలు గట్రాలు ఉండవు.. ఇంచుమించు 250 ఓడలున్నాయి ఇక్కడ! అన్నీ పాతబడినవే! చాలామట్టుకు శిథిలావస్థకు చేరినవే! ఇలా వందలాది నౌకలతో ఉన్న ఈ ప్రాంతాన్ని మాలోస్ బే అని పిలుస్తుంటారు.. వింత ఆకారాలతో ఉండే ఈ ఓడలు కాసింత భయాన్ని కూడా కలిగిస్తాయి. నది అంతటి దు:ఖాన్ని దిగమింగుకున్నట్టుగా కనిపిస్తుంటాయి.. ఒంటరిగా వెళితే మాత్రం దడుసుకోవడం ఖాయం..

Ghost Fleet (4)
ఎందుకిలా నౌకలన్నీ ఒకే దగ్గరకు చేరాయి..? వాటికెందుకీ దయనీయస్థితి..? రేవు ఎందుకు బావురుమంటోంది..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్లాలి… వందేళ్ల కిందటి మాట! మొదటి ప్రపంచయుద్ధం జరుగుతున్న కాలం.. 1917లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ యుద్ధానికి అవసరమయ్యే వెయ్యి నౌకలను తయారుచేయించాలనుకున్నాడు.. 18 నెలల్లోగా ఓడలు రెడీ అవ్వాల్సిందేనని ఆదేశించాడు. అమెరికా అధ్యక్షుడే తల్చుకున్నాడు కాబట్టి లక్షల మంది తగు సామగ్రితో జేమ్స్ నది తీరానికి వచ్చేశారు.. యుద్ధ ప్రాతిపదికన పనులను ప్రారంభించారు.. రాత్రింబవళ్లు పని చేశారు కానీ అనుకున్న టైమ్‌కు ఓడలను తయారు చేయలేకపోయారు.

Ghost Fleet (1)
వెయ్యి నౌకలను టార్గెట్‌గా పెట్టుకుంటే కొన్ని వందలు మాత్రమే సిద్ధమయ్యాయి.. ఈ నౌకల తయారీ జరుగుతున్నప్పుడే జర్మనీ లొంగిపోయింది.. యుద్ధం ముగిసిన తర్వాత నౌకలతో పనేముంటుంది చెప్పండి… ? అందుకే వాటన్నంటినీ మరో కంపెనీకి అమ్మేశారు.. ఓడలను కొన్న ఆ కంపెనీ వాటిని పొటొమాక్ నదిలోకి తెచ్చి పెట్టింది.. ఓడలతో మాంచి బిజినెస్ చేద్దామనుకుంది కానీ…పాపం బ్యాడ్‌లక్ ఆ కంపెనీ దివాళా తీసింది.. దాంతో నౌకలను పట్టించుకునేవాడే కరువయ్యాడు.. అనాథలా మిగిలిపోయిన ఓడలపై కొంతకాలానికి చెట్లు పుట్టుకొచ్చాయి.. జలచరాలకు నివాసాలుగా మారాయి.. కొన్ని పాడయ్యాయి.. అలా వందలాది నౌకలు ఓ మూలన పాడుబడినట్టు ఉండటంతో దయ్యాల నౌకల గుంపు అనే పేరొచ్చింది.. ఆ వెంటనే టూరిస్టులకు అట్రాక్టివ్‌గా మారింది.. ఆపై ప్రభుత్వం దృష్టి పడింది.. ఈ నౌకలు పగడపు దిబ్బలులా మారడంతో రెండేళ్ల కిందట జాతీయ సముద్ర జీవుల పరిరక్షణ ప్రాంతంగా గుర్తించింది ప్రభుత్వం.. ఇదండీ ఘోస్ట్ ఫ్లీట్ కథ….
మరిన్ని వీడియోలు చూడండి ఇక్కడ : Cyclone Yaas Live Video : అల్లకల్లోలంగా సముద్రతీరం..అతి తీవ్రమైన తుఫానుగా మారిన యాస్ సైక్లోన్..!(వీడియో).
Corona Virus: 100 మంది బౌద్ధ సన్యాసులకు కరోనా పాజిటివ్… చిన్న రాష్ట్రమైన సిక్కింలో కేసుల పెరుగుదల.. ( వీడియో ) Viral Video: వినూత్నంగా ఆకాశం లో ఎగురుతూ పెళ్లి… ఆతర్వాత ఏమైందో తెలిసి షాక్ లో కుటుంబ సభ్యులు.. ( వీడియో )




