తెలంగాణలో థాయ్‌లాండ్‌ పింక్ పండ్లు.. కొత్త పంట సాగుపై ఉద్యానశాఖ కసరత్తు.. భద్రాద్రి ఉపాధ్యాయుడి ప్రయోగం..

థాయ్‌లాండ్‌ జామ పండ్లను తెలంగాణలోనే పండించేందుకు రాష్ట్ర ఉద్యానశాఖ సన్నాహాలు మొదలుపెట్టింది.

తెలంగాణలో థాయ్‌లాండ్‌ పింక్ పండ్లు.. కొత్త పంట సాగుపై ఉద్యానశాఖ కసరత్తు..  భద్రాద్రి ఉపాధ్యాయుడి ప్రయోగం..
Follow us

|

Updated on: Jan 04, 2021 | 7:08 PM

దేశంలో విదేశీ పండ్లకు యమ గిరాకీ పెరిగింది. హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాలు, పట్టణాల్లో విదేశీ పండ్ల విక్రయాలు ఇటీవల పుంజుకున్నాయి. అవే పండ్లను తెలంగాణలోనే పండించేందుకు రాష్ట్ర ఉద్యానశాఖ సన్నాహాలు మొదలుపెట్టింది. ఇప్పటికే థాయ్‌లాండ్‌ జామ పండ్ల సాగుతో సత్ఫలితాలు ఇస్తుండటంతో అదే దేశానికి చెందిన ‘థాయ్‌ పింక్‌ పండ్లు’ పండించాలని కసరత్తు చేస్తోంది. వీటిని మనదేశంలో కశ్మీరీ ఆపిల్‌ బేర్‌గా పిలుస్తున్నారు. ‘తెలంగాణ లాల్‌ సుందరి’ అనే బ్రాండు పేరు పెట్టి వీటిని అమ్మేలా పంట సాగు చేయించాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో సాగవుతున్న ఆకుపచ్చని ఆపిల్‌ బేర్‌ పండ్లలా ఉండే థాయ్‌ పింక్‌ పండ్లను పండించేందుకు థాయ్‌లాండ్‌ నుంచి 5వేల మొక్కలను రాష్ట్ర ఉద్యానశాఖ దిగుమతి చేసుకుంటోంది. సిద్దిపేట జిల్లా ములుగులో ఈ శాఖకు చెందిన పంటల ప్రయోగ క్షేత్రంలో ఈ మొక్కలు నాటి సాగుకు ఉద్యానశాఖ ఏర్పాట్లు చేపడుతోంది. ఆసక్తిగల రైతులకు 3 వేల మొక్కలు ఇచ్చి సాగు చేయించి ఇతరులకు చూపాలని నిర్ణయించింది.

అయితే, ఇందులో భాగంగా భద్రాద్రి జిల్లా సారపాక మండలం నెల్లిపాక గ్రామానికి చెందిన కె.రాజు అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఈ పంటను తొలుత సాగు చేసేందుకు ముందుకు వచ్చాడు. గతంలో ఆకుపచ్చని ఆపిల్‌ బేర్‌ పంట సాగు చేసిన రాజు లాభాలు గడించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కొత్త రకం పండ్ల సాగు చేస్తున్నారు. గత మే నెలలో తెలంగాణ లాల్‌ సుందరి పండ్ల సాగు ప్రారంభించారు. ఎకరానికి రూ.20వేల చొప్పున కౌలు చెల్లించి ఐదెకరాల్లో సాగు ప్రారంభించారు. మొక్కకు రూ.250 వెచ్చించి బంగ్లాదేశ్‌ నుంచి దిగుమతి చేసుకున్న మొక్కలను.. ఎకరాకు 600 మొక్కలు నాటారు. ఇందుకోసం కౌలుతో కలిపి రూ.2లక్షల ఆరంభ పెట్టుబడి అయ్యినట్లు రాజు తెలిపారు. గత ఆగస్టులో గోదావరి వరదలో తోట మునిగి కొంత నష్టపోయినప్పటికీ.. మళ్లీ ఇప్పుడు పూత, కాత వస్తోందని వెల్లడించారు. కిలో పండ్లను రూ.60కి అమ్మాలని నిర్ణయించినట్లు రాజు చెప్పారు. ఒక్కో పండు రూ.3 లేదా 4 రూపాయలకు అమ్మితే ఎకరానికి రూ.3 లక్షలు గడించవచ్చని రాజు అంటున్నారు.

ఇదిలావుంటే, విదేశీ పండ్ల సాగుకు తెలంగాణ భూములు, వాతావరణం అనుకూలంగా ఉంటాయని ఉద్యానశాఖ అధికారులు తెలిపారు. థాయ్‌లాండ్‌ పింక్‌ ఫ్రూట్‌ను ఇక్కడ సాగు చేయిస్తామన్నారు.తక్కువ ధరకు థాయ్‌ పింక్‌ పండ్లు తింటే ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయని అధికారులు చెబుతున్నారు.

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..