AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైకోర్టును ఆశ్రయించిన టెనెట్ సంస్థ..చిక్కుల్లో వైసీపీ ఎంపీ

వైసీపీ ఎంపీ బాలశౌరిపై తెలంగాణ హైకోర్టును టెనెట్ సంస్థ ఆశ్రయించింది. తమ సంస్థ నడుపుతున్న ల్యాబ్‌ను తన బిల్డింగ్ నుంచి ఖాళీ చేయాలని ఎంపీ బెదిరిస్తున్నార‌ని ఆరోపించింది. కోవిడ్-19 టెస్టులు నిర్వహించడానికి ఐసీఎంఆర్‌ గుర్తించిన ల్యాబ్స్ లో టెనెట్ అని.. ఈ రీజ‌న్ తోనే బిల్డింగ్ ఖాళీ చేయాలంటూ నోటీసు ఇవ్వడంతో పాటు ల్యాబ్‌లోకి వెళ్లకుండాఎంపీ బాలశౌరి తన అనుయాయుల‌తో దౌర్జన్యంగా దారులు మూసివేశారని లాయర్ కోర్టుకు విన్న‌వించారు. త‌మ‌కు కినేటా టవర్‌లో పదేళ్లకు అద్దె అగ్రిమెంట్ […]

హైకోర్టును ఆశ్రయించిన టెనెట్ సంస్థ..చిక్కుల్లో వైసీపీ ఎంపీ
Ram Naramaneni
| Edited By: |

Updated on: Apr 23, 2020 | 7:30 PM

Share

వైసీపీ ఎంపీ బాలశౌరిపై తెలంగాణ హైకోర్టును టెనెట్ సంస్థ ఆశ్రయించింది. తమ సంస్థ నడుపుతున్న ల్యాబ్‌ను తన బిల్డింగ్ నుంచి ఖాళీ చేయాలని ఎంపీ బెదిరిస్తున్నార‌ని ఆరోపించింది. కోవిడ్-19 టెస్టులు నిర్వహించడానికి ఐసీఎంఆర్‌ గుర్తించిన ల్యాబ్స్ లో టెనెట్ అని.. ఈ రీజ‌న్ తోనే బిల్డింగ్ ఖాళీ చేయాలంటూ నోటీసు ఇవ్వడంతో పాటు ల్యాబ్‌లోకి వెళ్లకుండాఎంపీ బాలశౌరి తన అనుయాయుల‌తో దౌర్జన్యంగా దారులు మూసివేశారని లాయర్ కోర్టుకు విన్న‌వించారు.

త‌మ‌కు కినేటా టవర్‌లో పదేళ్లకు అద్దె అగ్రిమెంట్ ఉన్నప్పటికీ ల్యాబ్‌ను ఖాళీ చేయాలని బెదిరిస్తున్నార‌ని.. టెనెట్‌ మెడ్‌కార్పొ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తరపున డాక్టర్‌ టి.విజేందర్‌రెడ్డి హైకోర్టులో ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. 2011 నవంబరులో బిల్డింగ్ ఓన‌ర్ తో కినేటా సంస్థ పదేళ్ల పాటూ అగ్రిమెంట్ చేసుకుందన్నారు.ఈ పిటిషన్‌పై కోర్టు విచారణ సమయంలో గ‌వర్న‌మెంట్ లాయర్ కూడా వాదనలు వినిపించారు. ఇప్పటికే బిల్డింగ్ ఓన‌ర్ పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని.. అడ్డంకులు తొలగించారని హైకోర్టుకి తెలపారు. ఈ నేప‌థ్యంలో ల్యాబ్‌ నిర్వహణకు ఆటంకాలు కలిగిస్తే చర్యలు తీసుకోవాలని న్యాయ‌మూర్తి పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను వాయిదా వేశారు.

Follow Us