సాధువులపై మూకదాడి.. ఎన్సీపీ నేతకు సమన్లు జారీ.. అంతేకాదు..

ఏప్రిల్ 16న రాత్రి మహారాష్ట్ర పాల్‌ఘర్‌ ప్రాంతంలో సాధువులపై జరిగిన మూకదాడిపై దర్యాప్తు వేగవంతమైంది. ఇప్పటికే మూకదాడిలో పాల్గొన్న 110 మందిని అరెస్ట్ చేశారు. అంతేకాదు.. కేసును “సీఐడీ”కి తరలించింది మహారాష్ట్ర సర్కార్. సాధువులపై దాడి జరిగిన సమయంలో అక్కడే ఆ గ్రామ పంచాయితీకి చెందిన ఓ సభ్యుడిని పాల్‌ఘర్‌ పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. ఆయన ఎన్సీపీకి చెందిన నేత.. కాశీనాథ్ చౌదరీ అని తెలుసుకున్నారు. అతడికి ఈ మూకదాడికి సంబంధించి మహారాష్ట్ర పోలీసులు, సీఐడీ సమన్లు […]

సాధువులపై మూకదాడి.. ఎన్సీపీ నేతకు సమన్లు జారీ.. అంతేకాదు..
Follow us

| Edited By:

Updated on: Apr 23, 2020 | 8:44 PM

ఏప్రిల్ 16న రాత్రి మహారాష్ట్ర పాల్‌ఘర్‌ ప్రాంతంలో సాధువులపై జరిగిన మూకదాడిపై దర్యాప్తు వేగవంతమైంది. ఇప్పటికే మూకదాడిలో పాల్గొన్న 110 మందిని అరెస్ట్ చేశారు. అంతేకాదు.. కేసును “సీఐడీ”కి తరలించింది మహారాష్ట్ర సర్కార్. సాధువులపై దాడి జరిగిన సమయంలో అక్కడే ఆ గ్రామ పంచాయితీకి చెందిన ఓ సభ్యుడిని పాల్‌ఘర్‌ పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. ఆయన ఎన్సీపీకి చెందిన నేత.. కాశీనాథ్ చౌదరీ అని తెలుసుకున్నారు. అతడికి ఈ మూకదాడికి సంబంధించి మహారాష్ట్ర పోలీసులు, సీఐడీ సమన్లు జారీ చేశారు. దాడి జరిగిన సమయంలో.. ఆయన ఉనికిపై ఆరా తీస్తున్నారు. అతని స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్‌ చేశారు. ఇక ఆయనతో పాటుగా అక్కడే సీపీఎం నేతలు.. విష్ణు పార్థా, సుభాష్ భావర్, ధర్మా భావర్ కూడా అక్కడే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దాడికి సంబంధించిన ఓ వీడియోలో వీరు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.

కాగా.. దాడి జరుగుతున్న సమయంలో.. కాశీనాథ్‌ను పోలీసులు సంఘటనా స్థలానికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అతని ద్వారా ఉద్రిక్త పరిస్థితులు తగ్గే అవకాశం ఉండే ఆలోచనలో తీసుకెళ్లినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.